P Krishna
డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు.. నమ్మి ఆశ్రయం ఇచ్చిన వారిని నట్టేట ముంచుతున్నారు.. హత్యలు చేస్తున్నారు.
డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు.. నమ్మి ఆశ్రయం ఇచ్చిన వారిని నట్టేట ముంచుతున్నారు.. హత్యలు చేస్తున్నారు.
P Krishna
ఇటీవల కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్ద పడుతున్నారు. మాయ మాటలు చెప్పి మోసాలు చేస్తూ ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. డబ్బు కోసం సొంత వారిని, స్నేహితులను సైతం చంపడానికి సిద్దమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లగ్జరీ జీవితాలు గడిపేందుకు దేనికైనా తెగిస్తున్నారు. ఇటీవల అగ్ర రాజమ్యైన అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. మైనర్లు సైతం గన్స్ పట్టుకొని కాల్పులకు తెగబడుతున్నారు. ఇక భారత దేశంల నుంచి వెళ్లిన విద్యార్థులను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అలాంటి ఘటనో అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జార్జియాలో ఓ ఫుడ్ మార్ట్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు హర్యానాకు చెందిన వివేక్ సైని. ఇటీవల జులియన్ ఫౌల్క్ నర్ అనే వ్యక్తి ఆ ఫుడ్ మార్ట్ కి వచ్చాడు. వివేక్ తో సహా అక్కడి సిబ్బంది ఆ వ్యక్తికి సహాయం అందించారు. నిరాశ్రయుడైన జులియన్ ఫౌల్క్ నర్ అక్కడే ఉంటూ వచ్చాడు. కష్టాల్లో ఉన్నాడని భావించి అతన్ని ఎవరూ పట్టించుకోలేదు.. అభ్యంతరం చెప్పలేదు. మంచి నీరు, స్నాక్స్, కోక్ ఇలా అన్నీ ఇస్తూ వచ్చాడు వివేక్. సిగరెట్లస్, చాక్లెట్స్, బ్లాంకెట్ అన్ని ఇస్తూ సహాయం చేశాడు. పార్ట్ టైమ్ జాబ్ ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్న వివేక్ సైని పై జులియన్ ఫౌల్క్నర్ ఒక్కసారేదాడి చేసి సుత్తితో 50 సార్లు తలపై కొట్టి చంపాడు.
ఆస్పత్రికి తరలించేలోపు వివేక్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. జులియన్ ఫౌల్క్నర్ కొంత కాలంగా మత్తుకు బానిసయ్యాడుని.. డబ్బు కోసం వివేక్ ని చంపి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ మృత దేహాన్ని భారత్ కి పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నమ్మి ఆశ్రయం కల్పించి పాపానికి నిండు జీవితం బలి కావడంతో అక్కడి సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.