భార్య వండిన వంట రుచిగా లేదని భర్త దారుణం.. పాపం పిల్లలే..

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మొత్తం కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తుంది. పిల్లలు దిక్కులేని వారిగా మిగిలిపోతారు. భార్య వండిన వంట రుచిగా లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు.

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మొత్తం కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తుంది. పిల్లలు దిక్కులేని వారిగా మిగిలిపోతారు. భార్య వండిన వంట రుచిగా లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు.

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారికి మాత్రమే కాకుండా వారికి సంబంధించిన మనుషులకు కూడా శిక్ష పడేలా చేస్తాయి. తల్లిదండ్రులు చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సర్దుకుపోవడం తెలియక.. రాజీపడడం తెలియక ప్రాణాలు భాగస్వామి ప్రాణాలు తీసి జైలుపాలవుతున్నారు. పిల్లలని దిక్కులేని వాళ్ళని చేస్తున్నారు. కేవలం వంట బాగా చేయలేదని భార్యపై దారుణానికి ఒడిగట్టాడో భర్త. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.

భార్య వండిన వంట రుచిగా లేదని భార్యను హతమార్చాడో భర్త. ఉత్తరప్రదేశ్ బాలాఘాట్ కి చెందిన రవీన దుర్వే (28), నవీన్ దుర్వే దంపతులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్ లోని ప్రగతి కన్స్ట్రక్షన్స్ లో కూలీగా పని చేస్తున్నారు. 11 సంవత్సరాల క్రితమే వీరికి పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనురాధ దుర్వే 5వ తరగతి చదువుతుండగా, అన్షు దుర్వే వయసు 5 సంవత్సరాలు. అరుణవ్ దుర్వే అనే బాబు వయసు సంవత్సరం. పెద్ద పిల్లలు ఇద్దరూ ఉత్తరప్రదేశ్ లోని బంధువుల దగ్గర ఉంటున్నారు. ఏడాది బాబుతో కలిసి రవీనా దుర్వే, నవీన్ దుర్వే ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే భార్య వంట రుచిగా లేదని ఆమెతో గొడవ పెట్టుకున్నాడు భర్త. మాటా మాటా పెరగడంతో భార్య తలపై ఇటుకతో కొట్టాడు.

దీంతో రవీనా దుర్వే తీవ్ర గాయాల పాలై చనిపోయింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ దుర్వేను అదుపులోకి తీసుకున్నారు. రవీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. భార్య వంట రుచిగా లేదని ఆమెను చంపేశాడు. మరి ఇప్పుడు జైల్లో వంట బాగోపోతే ఏం చేస్తాడు? భార్యను చంపిన కారణంగా ఇక జైల్లోనే వాళ్ళు పెట్టిందే తినాలి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు పిలల్లని దిక్కు లేని వారిని చేస్తాయి. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటో? తప్పు చేసింది తండ్రి అయితే పిల్లలకి కూడా శిక్ష పడింది. తల్లిదండ్రులు దూరమైతే వాళ్ళు మానసికంగా ఎంత కుమిలిపోతారో అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు లేకపోతే ఆ పిల్లలు ఎలా పడితే అలా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వల్లే పిల్లలు నేరస్తులుగా తయారవుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.      

Show comments