లిఫ్ట్ ఇస్తామని చెప్పి తార్నాకలో మహిళపై గ్యాంగ్‌రేప్‌..!

దేశంలో ప్రతినిత్యం మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాటు కామంధులు రెచ్చిపోతున్నారు.

దేశంలో ప్రతినిత్యం మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాటు కామంధులు రెచ్చిపోతున్నారు.

ఈ మద్యకాలంలో దేశంలో పదుల సంఖ్యల్లో ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసులు నమోదు అవుతున్నాయి. సభ్య సమాజం సిగ్గు పడేలా చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. ఒకదశలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు వచ్చినా.. ఎలాంటి మార్పులు రావడం లేదు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలకు, యువతులకు మాయమాటలు చెప్పి వారికి మత్తు ఇచ్చి కామంధులు సామూహిక అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. అలాంటి ఘటనో హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ తార్నాకలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై కొంతమంది యువకులు సామూహిక అత్యాచారం చేసిన గటన తీవ్ర కలకలం రేపింది. తార్నాకలో ఓ మహిళకు నలుగురు వ్యక్తులు కలిశారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆమెపై అత్యాచారం చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాక కు చెందిన ఓ మహిళ 7వ తేదీ రాత్రి బస్టాండ్ లో వెహికిల్ కోసం ఎదురు చూస్తుంది. అది గమనించిన ఓ యువకుడు ఆమె కలిసి మాయ మాటలు చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు చాలా సన్నిహితంగా మూవ్ అయ్యాడు. తాను కూడా లాలా‌గూడాకు వెళ్తన్నా అభ్యంతరం లేకుండా అక్కడ విడిచి పెడతా అని చెప్పాడు. యువకుడి మాటలు నమ్మిన ఆ మహిళ అతని బైక్ ఎక్కింది. అప్పటికే అతని స్నేహితులకు సమాచారం అందించాడు.

లాలాగూడకు వెళ్లేందుకు షార్ట్ కట్ లో వెళ్లవొచ్చని చెప్పి దారి మళ్లించాడు. ఆమెను ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడికి యువకుడి స్నేహితులు వచ్చి కాపు కాస్తున్నారు. అలా నలుగురు యువకులు మహిళపై సామూహిక అత్యాచారం చేసి అక్కడే వదిలి పారిపోయారు. బాధితురాలు ఎలోగా అలా బయట పడి లాలాగూడ పోలీస్ స్టేషన్ కి చేరుకొని దుండగులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. నలుగురు నింధితుల్లో ఏసు (32) మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మధు (31), ప్రశాంత్ (20), రోహిత్ (19) లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments