iDreamPost
android-app
ios-app

కాలేజికి వెళ్లిన యువతి…తిరిగి వస్తుండగా దారుణం!

ఆ యువతి..తన భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం పొంది.. కుటుంబానికి ఆసరాగా ఉండాలని భావించింది. అయితే ఓ తాగుబోతు నిర్లక్ష్యానికి ఆ బంగారు తల్లి భవిష్యత్ చిధ్రమైంది.

ఆ యువతి..తన భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం పొంది.. కుటుంబానికి ఆసరాగా ఉండాలని భావించింది. అయితే ఓ తాగుబోతు నిర్లక్ష్యానికి ఆ బంగారు తల్లి భవిష్యత్ చిధ్రమైంది.

కాలేజికి వెళ్లిన యువతి…తిరిగి వస్తుండగా దారుణం!

ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే తల్లిదండ్రుల ప్రేమ ఎంతో గొప్పది. వీరి లవ్ కి సాటివచ్చేది ఏమి లేదు. బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని పెద్ద చేస్తుంటారు. కష్టపడి పని చేస్తూ.. బిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తుంటారు. ఇక వారు మంచి ఉద్యోగాలు సాధించి..తమకు ఆసరాగా ఉంటారని అమ్మానాన్నలు ఎన్నో కలలు కంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి ఆశలపై విధి నీళ్లు చల్లుతుంది. అంతేకాక ఆ కన్నవారికి కడుపుకోత మిల్చుతుంది. తాజాగా ఓ యువతి కుటుంబ విషయంలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇక ఈ ప్రమాదల్లో ఎంతో మంది యువత నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. బిడ్డలపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను ఈ రోడ్డు ప్రమాదలు చీకట్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా కాలేజికి వెళ్లిన ఓ యువతి..సాయంత్రానికి సంతోషంగా ఇంటికి వస్తుందని ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే వారికి మాత్రం సాయంత్రం విషాదమే మిగిలింది. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

women met accident

కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లా చెన్నమ్మ కిత్తూరు పట్టణంకి చెందిన కావేరి బసప్ప(20)  తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె  అదే పట్టణంలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది.  ప్రస్తుతం డిగ్రీ మూడ సెమిస్టర్ పరీక్షలకు కావేరి ప్రిపేర్  అవుతోంది. బుధవారం నాడు ఎంతో సంతోషంగా ఇంటి నుంచి కాలేజికి వెళ్లింది. సాయంత్రం తిరిగి  ఇంటికి బయలు దేరింది. అయితే అదే తనకు చివరి గడియాలు అని కావేరి ఊహించలేక పోయింది. ఆటో రూపంలో తనపై కి మృత్యువు వస్తుందని గ్రహించలేక పోయింది.

కాలేజి ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తుండగా వేగంగా వచ్చిన టంటం ఆటో వాహనం ఆమెను ఢీకొట్టింది.  ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే కావేరి మరణించింది. వాహనం డ్రైవర్ అనిల్  మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి.. ఆ యువతి ప్రాణాలు బలికొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన నిందితున్ని అరెస్టు చేశారు. మరి.. ఎలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి.. ఇతరుల ప్రాణాలను తీస్తున్న ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి