ఆన్‌లైన్ బెట్టింగ్ బానిసైన కొడుకు.. కుటుంబ సభ్యులు ఎంతపని చేశారంటే!

Nizamabad Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డదారులు తొక్కుతున్నానరు. ఇందుకోసం కోసం మానీ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్స్ కాస్తూ.. లక్షల్లో అప్పులు చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

Nizamabad Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డదారులు తొక్కుతున్నానరు. ఇందుకోసం కోసం మానీ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్స్ కాస్తూ.. లక్షల్లో అప్పులు చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ పుణ్యమా అని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పెడుతూ అప్పులపాలవుతున్నారు.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.  పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. స్నేహితులు,  కుటుంబ సభ్యులు వారిస్తున్నా బెట్టింగ్‌లో డబ్బులో పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆన్‌లైన్ బెట్టింగ్ కి బానిసైన కొడుకు పుణ్యమా అని కుటుంబ సభ్యులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వడ్డేపల్లి గ్రామంలో సురేష్ ఆయన భార్య హేమలత వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి హరీష్ అనే కొడుకు ఉన్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల బిజీలో ఉంటే హరీష్ ఎప్పుడూ సెల్ పోన్ లో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేసేవాడు. తండ్రి ఎన్నిసార్లు మందలించినా హరీష్ లో మార్పు రాకపోవడంతో పట్టించుకోవడం మానేశారు. అలా సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ హరీష్ ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కి బానిసయ్యాడు. అందులో డబ్బులు పెడుతూ వచ్చాడు.. వందలు కాదు.. వేలు కాదు ఏకంగా లక్షల్లో బెట్టింగులు కాయడం మొదలు పెట్టాడు. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌లో డబ్బులు పెడుతున్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు హరీష్ ని నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. తాను బెట్టింగ్‌లో రూ.30 లక్షల వరకు పెట్టినట్లు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు.

హరీష్ బయట ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ల వద్ద డబ్బులు తీసుకున్న విషయం తెలుసుకొని పరువు పోతుందని జీవనోపాధిగా ఉన్న పొలాన్ని అమ్మారు. అయినా కూడా అప్పు తీరకపోవడం.. అప్పుల వాళ్లు పదే పదే ఇంటికి రావడం, ఫోన్లు చేసి వేధించడంతో దిక్కుతోచని పరిస్థితిలో చావే శరణ్యం అని భావించారు. ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డారు. కొడుకు చేసిన తప్పుకి తల్లిదండ్రులు బలయ్యారని గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Show comments