P Krishna
Nizamabad Crime News: ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై బంగారం లాంటి భవిష్యత్ బుగ్గి పాలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
Nizamabad Crime News: ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై బంగారం లాంటి భవిష్యత్ బుగ్గి పాలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు.
P Krishna
ఈ మధ్య పని ఒత్తిడి, ఆర్థిక పరిస్థితులు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగా కొంతమంది కుటుంబాల్లో గొడవలు పడటం జరుగుతుంది. ఆ సమయంలో మానసికంగా కృంగిపోయి తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడమో లేదా బలవన్మరణానికి పాల్పపడటమో జరుగుతుంది. ఏడాది క్రితం పెళ్లైన జంట ఎంతో హ్యాపీగా ఉన్న సమయంలో ఓ చిన్న కారణంతో దారుణానికి తెగబడ్డారు. ఈ సంఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లా నవీన్ పేట్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.నవీపేట్ మండలం మిట్టాపూర్ రైల్వే గేటు వద్ద యువ జంట ఆత్మహత్యకు పాల్పపడ్డారు. పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనీల్ (28), పొతంగల్ కు చెందిన శైలజ (24) గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అనీల్, శైలజ ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. సోమవారం ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని.. అది భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తూ మానసికంగా తమను చిత్ర వద చేస్తున్నారని, అందుకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఓ వీడియో రికార్డు కోటగిరి ఎస్సై సందీప్ కి పంపారు.
అలర్ట్ ఆయిన నవీపేట ఎస్సై యాదగిరి వీడియోతో పాటు వారి సెల్ నెంబర్ పంపాడు. సిబ్బందితో కలిసి బాసర వంతెన వద్దకు వెళ్లి గాలించగా ఎవరూ కనిపించలేదు. బాధితుల ఫోన్ ట్రాక్ చేయగా ఫకిరాబాద్ – మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు చూపించడంతో వెంటనే అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు రైలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పెళ్లై ఏడాది కూడా కాలేదు.. హ్యాపీగా ఉంటున్న అనీల్, శైలజ ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నారయ్యారు.