iDreamPost
android-app
ios-app

బిక్షం అడిగినందుకు ప్రాణాలు తీశాడు.. వీడియో వైరల్

  • Published Feb 24, 2024 | 1:41 PM Updated Updated Feb 24, 2024 | 1:41 PM

Nizamabad Crime News: ఓ అధికారి ఉన్మాదం, గర్వంతో చేసిన పనికి అమాయకుడైన యాచకుడు దుర్మరణం పాలయ్యాడు.. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది.

Nizamabad Crime News: ఓ అధికారి ఉన్మాదం, గర్వంతో చేసిన పనికి అమాయకుడైన యాచకుడు దుర్మరణం పాలయ్యాడు.. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది.

బిక్షం అడిగినందుకు ప్రాణాలు తీశాడు.. వీడియో వైరల్

ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతూ.. ఎదుటి వారిపై దాడులు చేయడం, ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, అరోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ కి గురై క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది అధికార హోదాలో ఉండి పది మందికి సహాయపడాల్సిందిపోయి.. గర్వంతో దారుణాలకు తెగబడుతున్నారు. అలా ఓ అధికారి కండకావరం బిక్షగాడి జీవితాన్ని బలి కోన్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిక్షం అడిగిన పాపానికి ఓ యాచకుడిని డిప్యూటీ తహశీల్దార్ కాలితో తన్నడంతో రోడ్డుపై వెళ్తున్న టిప్పర్ కింద పడిపోయి స్పాట్ లోనే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్-మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడిన సమయంలో డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ కారు ఆగింది. శివరాం (32) యాచకుడు కారు అద్దాలు తుడిచి డబ్బులు ఇవ్వమని ప్రాదేయపడ్డాడు. కారు డ్రైవర్ చేస్తున్న రాజశేఖర్ కారును కొద్దిగా ముందుకు పోనిచ్చాడు. డబ్బులు ఇస్తాడన్న ఆశతో శివరాం కారుతో పాటు ముందుకు వచ్చాడు.

డిప్యూటీ తహసీల్దార్ కారులో నుంచి కిందకు దిగి కోపంతో శివరాం ని కాలితో తన్నాడు. వెనుక నుంచి వస్తున్న టిప్పర్ వెనుక టైర్ కింద పడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు శివరాం. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వెరల్ అవుతున్నాయి. యాచకుడు శివరాం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిక్షం అడిగిన పాపానికి నిండు ప్రాణాలు బలికొన్న డిప్యూటీ ఎమ్మార్వో రాజశేఖర్ ని కఠినంగా శిక్షించాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.