iDreamPost
android-app
ios-app

నమ్మి ట్యాక్సీ ఎక్కింది.. డ్రైవర్ ఎంతపని చేశాడంటే?

  • Published Apr 29, 2024 | 8:55 AM Updated Updated Apr 29, 2024 | 8:55 AM

ఇటీవల దేశంలో ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

ఇటీవల దేశంలో ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

  • Published Apr 29, 2024 | 8:55 AMUpdated Apr 29, 2024 | 8:55 AM
నమ్మి ట్యాక్సీ ఎక్కింది.. డ్రైవర్ ఎంతపని చేశాడంటే?

ఈ మధ్య కాలంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చిన్న, పెద్ద అనే వయసు తేడా లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే కామాంధులు రెచ్చిపోతున్నారు. అత్యాచారం చేసిన అనంతరం తమ గుట్టు బయటపడుతుందని దారుణంగా హత్యలు చేస్తున్నారు. కొంతమంది కేటుగాళ్ళు మహిళలను నమ్మించి మాయమాటలు చెప్పి తమ అవసరాలు తీర్చుకొని గుట్టు చప్పుడు కాకుండా హతమార్చుతున్నారు. అలాంటి ఘటనే నవీ ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నవీ ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం చిర్నెర్ గ్రామానికి చెందిన సంజయ్ పాటిల్ అనే వ్యక్తి మార్నింగ్ వాకింగ్ చేస్తూ రోడ్డు వెళ్తున్నాడు.. అంతలోనే అక్కడ దుర్వాసన రావడం గమనించి వెళ్లి చూడగా గోనె సంచిలో ఓ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 19న మాన్ ఖుర్డ్ లో తప్పిపోయిన కేసు కి సంబంధించిన మహిళగా గుర్తించిన పోలీసులు వారి బంధువులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి, సోదరుడు సదరు మహిళ హెయిర్ క్లిప్‌లు, రెండు వేళ్ల ఉంగరాలు, బ్రాస్‌లెట్‌తో పాటు దుస్తులు పూనం చంద్రకాంత్ క్షీరసాగర్ (27) గా గుర్తించారు. ఈ క్రమంలోనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు మహిళ మిస్టరీ కేసు ఛేదించారు.. నిందితుడిని ఉరాన్ పోలీసులు అరెస్టు చేశారు.కేసు గురించి సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సతీష్ నికం మాట్లాడుతూ.. మృతురాలు క్షీరసాగర్ కొంతకాలంగా నాగ్‌పాడ్ లో ట్యాక్సీ డ్రైవర్ తో సంబంధం కలిగి ఉంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. ట్రాక్సీ డ్రైవర్ నిజాముద్దీన్ అలీ (28)ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. ఏప్రిల్ 18 సాయంత్రం అలీ, క్షీరసాగర్ ని జేజే హాస్పిటల్ దగ్గరకు రమ్మన్నాడు. తన ప్రియుడే కదా అని నమ్మ వచ్చింది పూనం చంద్రకాంత్. ఆమెను పికప్ చేసుకొని కళ్యాణ్ వద్ద ఖాదవ్లీ నది ఒడ్డుకు తీసుకువెళ్లి దారుణగా గొంతుకోసి హత్యచేసి మృతదేహాన్ని గోనె సంచిలో పడేసి వెళ్లిపోయాడు.ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన నిందితుడు అలీ కి పెళ్లై రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం క్షీరసాగర్ తో అక్రమసంబంధం కొనసాగిస్తున్నాడు. అలీని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ సతీష్ నికం తెలిపారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet