iDreamPost
android-app
ios-app

దారుణం: ప్రియుడి మోజులో పడి కన్న కొడుకునే..

  • Published Mar 21, 2024 | 3:20 PM Updated Updated Mar 21, 2024 | 3:20 PM

Nagarkurnool Crime News: ఇటీవల అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. క్షణిక సుఖం కోసం కట్టుకున్న భర్త, పిల్లలను కూడా హతమార్చుతున్నారు కొంతమంది మహిళలు..

Nagarkurnool Crime News: ఇటీవల అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. క్షణిక సుఖం కోసం కట్టుకున్న భర్త, పిల్లలను కూడా హతమార్చుతున్నారు కొంతమంది మహిళలు..

  • Published Mar 21, 2024 | 3:20 PMUpdated Mar 21, 2024 | 3:20 PM
దారుణం: ప్రియుడి మోజులో పడి కన్న కొడుకునే..

ఈ మద్య కాలంలో మానవ సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను దారుణంగా హతమార్చుతున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు.  సహజీవనం పేరుతో తమ కామవాంఛ తీర్చుకొని మోజు తీరిన తర్వాత కొంతమంది మగాళ్లు.. మహిళలు దారుణంగా హత్య చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది మహిళలు శారీరక సుఖం కోసం కడుపున పుట్టిన పిల్లలను సైతం కడతేర్చుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తన ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించడానికి తరుచూ అడ్డు వస్తున్నాడని భావించిన ఓ కసాయి తల్లి అమ్మతనాన్ని మరిచింది.. పేగు పంచుకు పుట్టిన కొడుకును కర్కశంగా హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం అలీపూర్ గ్రామానికి చెందిన రవి, లక్ష్మి దంపతులు. వీరి కుమారుడు హరీష్ (11). గత కొంత కాలంగా లక్ష్మి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. భర్త లేని సమయంలో తరుచూ తన పియుడిని ఇంటికి పిలుపించుకుంటు వస్తుంది లక్ష్మి. ఒకసారి వీరిద్దరూ బాగోతాన్ని హరీష్ కళ్లారా చూశాడు. తన శారీరక సుఖానికి తరుచూ కొడుకు అడ్డు వస్తున్నాడని భావించిన లక్ష్మి తాను ఒక అమ్మ అన్న విషయాన్ని మరిచి దారుణమైన నిర్ణయం తీసుకుంది.

గురువారం ఇంట్లో భర్త లేని సమయం చూసి హరీష్ తలపై రోకలి బండతో కొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో హరీష్ అక్కడిక్కడే చనిపోయాడు. కొడుకుని అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడేసి తన కొడుకు నీటి తొట్టిలో ప్రమాదవశాత్తు పడిపోయి కన్నుమూశాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే తలకు గాయం కనిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హరీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి తరలించారు. భర్త కూడా తన భార్యపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో లక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

Jojobet Girişİmajbetjojobetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom