iDreamPost
android-app
ios-app

అమ్మ పేరుకే కళంకం.. అక్రమ సంబంధానికి అడొస్తుందని కన్న కూతుర్ని..

  • Published Aug 28, 2024 | 3:35 PM Updated Updated Aug 28, 2024 | 3:35 PM

Muzaffarpur Crime News: ఇటీవల వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం చూస్తూనే ఉన్నాం. వివాహేతర సంవబంధాలకు అడ్డు వస్తున్నారని సొంత పిల్లలను సైతం హతమార్చుతున్నారు.

Muzaffarpur Crime News: ఇటీవల వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం చూస్తూనే ఉన్నాం. వివాహేతర సంవబంధాలకు అడ్డు వస్తున్నారని సొంత పిల్లలను సైతం హతమార్చుతున్నారు.

  • Published Aug 28, 2024 | 3:35 PMUpdated Aug 28, 2024 | 3:35 PM
అమ్మ పేరుకే కళంకం.. అక్రమ సంబంధానికి అడొస్తుందని కన్న  కూతుర్ని..

ఈ మధ్య దేశంలో అక్రమ సంబంధాలు నిండు సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని సొంత పిల్లలనే హతమార్చుతున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఆగస్టు 24న కొంతమంది చెట్ల పొదల్లో ఓ రెడ్ సూట్ కేస్ చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన సూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. ఆ సూట్ కేసులో మిస్తీ అనే మూడేళ్ల బాలిక మృతదేహం చూసి షాక్ తిన్నారు పోలీసు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనేక కోణాల్లో విచారణ కొనసాగించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో హృదయ విదారకమైన సంఘటన వెలుగు చూసింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని మూడేళ్ల కూతురిని తల్లి దారుణంగా హతమార్చి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్ లో కుక్కి చెట్ల పొదల్లో దాచిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.  చిన్నారి మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈక్రమంలోనే చిన్నారిని హత్య చేసింది సొంత తల్లే అని షాక్ తిన్నారు. ప్రస్తుతం చిన్నారి తల్లిని అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెల్లడించింది. మనోజ్ కుమార్, కాజల్ కుమారి దంపతులు. వీరికి మూడేళ్ల పాప మిష్తీ. ఈ మధ్య చిన్నారి హత్యకు గురైంది. తన భార్యపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు చిన్నారి తండ్రి.

ఈ క్రమంలోనే పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా.. పాప తల్లి కాజల్ కుమారి తానే  నేరం చేసినట్లు ఒప్పుకుంది. రాంపురహరి నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడితో అక్రమ సంబంధం ఉందని చెప్పింది. తన భర్తను వదిలివేస్తా.. నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. కానీ ఆ ప్రియుడు మాత్రం మన సంబంధానికి కూతురు అడ్డు వస్తుందని చెప్పడంతో చిన్నారిని చంపేందుకు పథకం వేసింది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఛానల్ లో క్రైమ్ షోలు చూస్తూ పాపను చంపి, మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి చెత్త కుప్పలో పడేసింది. పాప కనిపించకుండా పోయిందని భర్తతో చెప్పింది. ఆమె ప్రవర్తనపై మనోజ్ కి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలోనే చిన్నారి మృతదేహం లభ్యం కావడం.. తీగ లాగితే డొంక కదిలినట్లు పాపను హత్య చేసింది సొంత తల్లే అని తేలింది. క్షణిక సుఖం కోసం నవమాసాలు మోసి కనీ పెంచిన కూతురుని కడతేర్చిన కసాయి తల్లి దారుణంపై స్థానికులు ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetmilanobetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio