P Krishna
P Krishna
ఇటీవల దేశంలో మహిళలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యల పర్వం కొనసాగుతుంది. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. ఒక రకంగా ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వాలు దిశ, నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కామాంధుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇటీవల ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాల్లో యువతు హత్యలకు గురి అవుతున్నారు. ఓ ట్రైనీ ఎయిర్ హైస్టెస్ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ముంబైలో చెటు చేసుకుంది.
ముంబాయి శివారు ప్రాంతం అంధేరిలో రూపాల్ ఓగ్రే (25) అనే యువతి తన ఫ్లాట్ లో దారుణ హత్యకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఆమె ఎయిరిండియాకు ఎంపీ అయ్యింది. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నట్లు సమాచారం. గత కొంత కాలంగా అంధేరీలోని మరోల్ కృష్ణన్ లాల్ మార్వామార్గ్ హౌజింగ్ సొసైటీకి చెందిన ఒక ఫ్లాట్‌లో తన సోదరి, ఆమె బోయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటుంది. ఇటీవల వారిద్దరూ తమ గ్రామానికి వెళ్లిపోవడంతో రూపాల్ ఒంటరిగా ఫ్లాట్ లో ఉంటుంది. ఆదివారం సాయంత్రం నుంచి రూపాల్ కి కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే రూపాల్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఫ్లాట్ కి వెళ్లి చూడాల్సిందిగా కోరారు.
రూపాల్ స్నేహితులు ఫ్లాట్ కి వచ్చి చూడగా లోపలి నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఫ్లాట్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రూపాల్ రక్తపు మడుగులో పడివుంది. అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించి అనుమానాస్పద కేసు కింద నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సొసైటీలో స్వీపర్ గా పని చేస్తున్న విక్రమ్ అత్వాల్ (40) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొసైటీలో ఉన్న సెక్యూరిటీ కెమెరాల వీడియో ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కేసులో నింధితుడిగా అనుమానిస్తున్న విక్రమ్ భార్యను కూడా పోలీసులు విచారిస్తున్నారు. 12 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.