iDreamPost

విషాదం.. మరణంలోనూ వీడని బంధం!

ఈ మద్య కాలంలో రోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారలు అంటున్నారు.

ఈ మద్య కాలంలో రోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారలు అంటున్నారు.

విషాదం.. మరణంలోనూ వీడని బంధం!

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవ రాహిత్యం కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి అనాథలుగా మిగులుతున్నారు. ఎంతోమంది వికలాంగులుగా మారుతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాల రూపంలో వడ్డిస్తున్నా.. కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని దుఖాఃన్ని మిగిల్చింది.  ఈ విషాద ఘటన మంథనిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మంథని పట్ణంలో నలుగురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. అందులో ఇద్దరు అన్నదమ్ములను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించింది. వృద్దాప్యంలో అండగా ఉంటారనుకున్న కొడుకులు ఒకేసారి చనిపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది.. ఆమె ఏడుపుని ఎవరూ ఆపలేకపోయారు. కంటికి రెప్పలా సాకిన కొడుకులు కంటికి దూరమయ్యారనే బాధను జీర్ణించుకోలేకపోతుంది ఆ తల్లి. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన తాటి నాగరాజు, అతని సోదరుడు నవీన్ ఇద్దరు బేగంపేటకు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. లక్కేపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ఎదురుగా ట్రక్టర్ అతివేగంగా వచ్చి బైక్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నవీన్ అక్కడిక్కడే కన్నుమూశాడు. నాగరాజు ని స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

అక్కనెపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ ప్రమాదానికి కారణంగా గుర్తించారు. అన్నదమ్ములు ప్రయాణిస్తున్న బైక్ ని ఢీ కొట్టిన ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లో పడి ఉండవొచ్చని, అక్కడ పడి ఉన్న మట్టి పెల్లలు, ట్రాక్టర్ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. డ్రైవర్ ట్రాక్టర్ ని సరిచేసుకొని అక్కడి నుంచి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. నాగరాజు భార్య, కూతురు ఉండగా, నవీన్ భార్య, సంవత్సరం, మూడేళ్ల బాబు ఉన్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్ తెలిపారు. మంథనికి చెందిన తాటి రాధ-బాపులకు నలుగురు సంతానం. మూడేళ్ల క్రితమే బాపు చనిపోయాడు.. ఆ దుఖఃం నుంచి కోలుకోక ముందే ఇద్దరు కొడుకులు చిపోవడం ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. మరణంలోనూ అన్నదమ్ముల బంధం వీడలేదని, ఆ కుటుంబం బాధను చూడలేక స్థానికులు సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి