iDreamPost
android-app
ios-app

నర్సుగా పదిమందికి సేవ చేయాలనుకుంది.. అంతలోనే.

  • Published Aug 16, 2024 | 12:26 PM Updated Updated Aug 16, 2024 | 12:26 PM

Mancherial Crime News: వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత వారి ఆరోగ్యం కుదుట పడేవరకు రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకునే వారు నర్సులు. రోగి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారికి నయమయ్యేవ సేవలు అందిస్తుంగారు. ఆ యువతి నర్సు కోర్సు పూర్తి చేసి పదిమందికి సేవచేయాలనుకుంది.. కానీ విధి మరోలా చూసింది.

Mancherial Crime News: వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత వారి ఆరోగ్యం కుదుట పడేవరకు రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకునే వారు నర్సులు. రోగి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారికి నయమయ్యేవ సేవలు అందిస్తుంగారు. ఆ యువతి నర్సు కోర్సు పూర్తి చేసి పదిమందికి సేవచేయాలనుకుంది.. కానీ విధి మరోలా చూసింది.

  • Published Aug 16, 2024 | 12:26 PMUpdated Aug 16, 2024 | 12:26 PM
నర్సుగా పదిమందికి సేవ చేయాలనుకుంది.. అంతలోనే.

మనకు ఎదైనా ప్రమాదం జరిగినా.. అనారోగ్యం పాలైనా హాస్పిటల్ లో చేరితే వారిని కంటికి రెప్పలా చూసేవారు నర్సులు. అందుకే వారిని సోదరిగా (సిస్టర్) అని పిలుస్తారు. రోగులకు మనోధైర్యం కల్పించి ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరే వారక అన్నిరకాల సేవలు అందిస్తారు నర్సులు. రాత్రింబంళ్ళు హాస్పిటల్స్ లో విధులు నిర్వహిస్తూ.. ప్రతి విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువుల్లా ఆప్యాయంగా పలుకరిస్తుంటారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో నర్సుల సేవలు ప్రపంచం మొత్తం పొగిడింది. అలాంటి నర్సు కోర్సు చేసి పదిమందికి తన వంతు సేవ చేయాలని భావించిన ఓ యువతి కల చెదిరింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి చేరుతారా అన్న అనుమానం ప్రతిరోజూ కలుగుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్.. అడ్డూ అదుపు లేని డ్రైవింగ్. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్న ప్రయాణికుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.  మంచిర్యాల వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా వద్ద ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు బైక్ ని ఢీకొన్ని ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుంటకు చెందిన రేగుంట రమేష్, అతని కూతురు దీప (24) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ అతని కూతురు దీపకు గాయాలయ్యాయి. వెంటనే తండ్రీకూతుళ్లను వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. చికిత్స పొందుతూ దీప గురువారం తుది శ్వాస విడిచింది. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన దీప జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుంది. నర్సుగా పదిమందికి సేవ చేయాలనే తన ఆశయం, కల చెదిరిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీప మరణంతో స్థానికులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు.