P Krishna
ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే గొడవ పడటం.. ఎదుటి వారిపై దాడులు చేయడం లేదా తమను తామే శిక్షించుకోవడం లాంటివి చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది.
ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే గొడవ పడటం.. ఎదుటి వారిపై దాడులు చేయడం లేదా తమను తామే శిక్షించుకోవడం లాంటివి చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది.
P Krishna
ఇటీవల భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్తుంటారు. వారం రోజుల ముందు నుంచే గ్రామాల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. కొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటి ముందు రంగు రంగుల హరివిల్లు, చిన్న పిల్లలు పతంగులు ఎగురవేయడం లాంటివి చేస్తుంటారు. తాజాగా సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనివ్వలేదని ఓ వివాహిత దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబ్ నగర్ జిల్లా అచ్చం పేటలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగకు కొత్త బట్టల విషయంలో భర్తతో గొడవ పెట్టుకున్న భార్య మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాంపూర్ పెంటలో చిన్న బయ్యన్న నల్లమలలోని పెద్ద వాగు బేస్ క్యాంప్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. చిన్న భార్య నాగమ్మ (25), కూతుళ్లు బయ్యమ్మ(3), యాదమ్మయ (1) ఉన్నారు. గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బట్టలు తీసుకోవాలని నాగమ్మ భర్తతో చెప్పింది. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని మూడు నెలలుగా జీతం రావడం లేదని చిన బయ్యన్న సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలోనే బయ్యన్న పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగమ్మ తన ఇద్దరు కూతుళ్ల గొంతు నులిమి చంపింది. తర్వాత తాను ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. స్థానికులు ఇది గమనించి వెంటనే మన్ననూర్ లో ఉన్న చిన్న బయ్యన్నకు సమాచారం అందించారు. ఇంటికి వచ్చిన బయ్యన్న భార్యా, బిడ్డలను చూసి కన్నీరు మున్నీరయ్యాడు. బట్టలు తర్వాత కొని ఇస్తానని చెప్పినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక కష్టాలు ముగ్గురు ప్రాణాలు తీయడంతో స్థానికులు కంట నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.