iDreamPost
android-app
ios-app

అనుమానంతో భార్యని చంపి.. సాక్ష్యం చెప్తారని పిల్లల్ని కూడా దారుణంగా!

  • Published Apr 01, 2024 | 2:22 PM Updated Updated Apr 01, 2024 | 2:22 PM

Lucknow Crime News: పెళ్లై ఏడేళ్లు అయ్యింది.. భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అందమైన వీరి జీవితంలో అనుమానం పెనుభూతంలా దాపురించింది.

Lucknow Crime News: పెళ్లై ఏడేళ్లు అయ్యింది.. భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అందమైన వీరి జీవితంలో అనుమానం పెనుభూతంలా దాపురించింది.

  • Published Apr 01, 2024 | 2:22 PMUpdated Apr 01, 2024 | 2:22 PM
అనుమానంతో భార్యని చంపి.. సాక్ష్యం చెప్తారని పిల్లల్ని కూడా దారుణంగా!

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను పెద్దలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తుంటారు. కానీ ఈ మధ్య భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే తరుచూ గొడవ పడటం.. ఆ గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి విడిపోయే పరిస్థితికి రావడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని తనని మోసం చేసిందనే కక్ష్యతో భార్యతో సహ పిల్లల్ని హత్య చేసిన ఘటన సంచలనం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకి చెందిన రామ్ లగన్ తన భార్య జ్యోతి(30) తో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో జీవిస్తున్నాడు. వీరి వివాహం జరిగి ఏడేళ్లైంది. పెళ్లైన కొత్తలో వీరి సంసారం చాలా సంతోషంగా సాగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు పాయల్ (6), ఆనంద్ (3). ఇటీవల తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పదే పదే అనుమానిస్తూ ఆమెను హింసించడం మొదలు పెట్టాడు రామ్ లగన్.

ఈ క్రమంలోనే మార్చి 28న భార్యాభర్త మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దుపట్టాతో జ్యోతి గొంతు గట్టిగా బిగించి ఊపిరి ఆడకుండా చంపేశాడు. భార్యను చంపుతున్న సమయంలో పిల్లలు గట్టిగా అరవడంతో వాళ్లను కూడా చంపేశాడు. ఆ రోజు నుంచి భార్యా, పిల్లలతో మూడు రోజులు అక్కడే గడిపాడు. భార్యాపిల్లలను చంపిన పశ్చాతాపం ఏమాత్రం లేకుండా ఉదయం తన పనులు చేసుకొని రాత్రి ఇంటికి వచ్చి మృతదేహాల వద్ద పడుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని డోర్ తెరిచి చూశాడు. గోనె సంచిలో మూడు మృతదేహాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని రామ్ లగన్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతుంది.

 

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio