iDreamPost
android-app
ios-app

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని 20సార్లు కత్తితో పొడిచిన నటుడు!

  • Published May 31, 2024 | 3:51 PM Updated Updated May 31, 2024 | 3:51 PM

Los Angeles Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తున్నారు.. తీవ్ర మనస్థాపానికి గురై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆ క్షణం తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు.

Los Angeles Crime News: ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తున్నారు.. తీవ్ర మనస్థాపానికి గురై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆ క్షణం తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు.

  • Published May 31, 2024 | 3:51 PMUpdated May 31, 2024 | 3:51 PM
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని 20సార్లు కత్తితో పొడిచిన నటుడు!

కొంతమంది క్షణికావేశంలో తీసుకునే చర్యలు తమ జీవితాలపై దారుణమైన ప్రభావం చూపిస్తుందని అంటారు. ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. ఈ క్షణంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఇలాంటివి ప్రేమ వ్యహారాలు, వివాహేతర సంబంధాలు, ఆర్థిక వ్యవహారాల కారణంగా జరుగుతున్నాయి. హాలీవుడ్ లో ఓ నటుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ నటుడు తన మాజీ ప్రియురాలి విషయంలో దారుణానికి పాల్పపటడం తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రముఖ సినీ నటుడు నిక్ పాస్క్వల్ (34) తన  మాజీ గర్ల్ ఫ్రెండ్ పై హత్యాయత్నం చేశాడు. గత కొంత కాలంగా హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అల్లీ షెహర్న్, నిక్ ప్రేమించుకున్నారు.. సహజీవనం చేశారు. ఇటీవల కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే నిక్ పాస్క్వల్.. అల్లీ షెహార్న్‌ ఇంటికి వెళ్లి 20 సార్లు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాస్ ఎంజిల్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఆఫీస్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లీ షెహార్న్‌ పై నిక్ పాస్క్వల్ పాశవికంగా కత్తితో దాడి చేసి చనిపోయిందని భావి అక్కడ నుంచి పారిపోయినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే తన  మాజీ ప్రియురాలు అయిన అల్లీ షెహార్న్‌ హత్యాయత్నం చేసి పారిపోయిన నిక్ పాస్క్వల్‌ను పోలీసులు టెక్సాస్‌లోని యూఎస్-మెక్సికో సరిహద్దు చెక్‌పాయింట్ వద్ద అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన గురువారం తెల్లవారుజామున 4.30 నిమిషాలకు షెహార్న్ నివాసంలో జరిగింది. షెహర్న్‌తోపాటు మరికొందరిపైనా నటుడు పాస్కవాల్ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేరారోపణలు రుజువు అయితే నటుడు పాస్కవల్‌కు జీవిత ఖైదు శిక్ష పడే చాన్స్ ఉందని అంటున్నారు.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabetganobet