భర్త, అత్తా, మామలు అలా అడిగేసరికి.. ఆ ఇల్లాలు ఏం చేసిందంటే?

ఇటీవల దేశంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. దీంతో వారి కుటుంంబాల్లో తీవ్ర విషాదం నిండుకుంటుంది.

ఇటీవల దేశంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. దీంతో వారి కుటుంంబాల్లో తీవ్ర విషాదం నిండుకుంటుంది.

పెళ్ళంటే నూరేళ్ల పంట.. వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల దీవెనలతో మూడుముళ్ళ బంధంతో ఒక్కటవుతారు జంట. ఎన్నో ఆశలు పెట్టుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన పెళ్లి కూతురు కొద్ది రోజుల్లోనూ ఆత్మహత్యలు, హత్యలకు గురైన సంఘటనలు జరుగుతున్నాయి. కుటుంబాల్లో చిన్న చిన్న కలహాల కారణం, అత్త మామ, ఆడబిడ్డలు, భర్త వేధింపుల కారణం వల్ల కొంతమంది మహిళలు బలవ్మరణాలకు పాల్పపడుతున్నారు. కోటి ఆశలతో అత్తారింటికి పంపిన తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనలతో తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు.  తాజాగా కర్ణాటకలోని మాండ్యా జిల్లా దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు తట్టుకోలేక  బలవన్మరణానికి పాల్పపడింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో చోటు చేసుకుంది. రంజిత (29), మధు ఐదేళ్ల క్రితం వివాహబంధంలో ఒక్కటయ్యారు. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ఇటీవల అత్త మామ, భర్త అదనంగా కట్నం తీసుకురావాలని రంజితను పదే పదే అడగడం మొదలు పెట్టారు. కొన్నిసార్లు వీళ్ల వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది రంజిత. ఆ సమయానికి తల్లిదండ్రులు రంజితకు ధైర్యం చెప్పేవారు.. అత్తింటి వాళ్లతో మాట్లాడుతామని సర్ధిచెప్పేవారు.

ఓ ప్రైవేట్ పాఠశాలలో రంజిత టీచర్ గా పని చేస్తుంది. మధు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి నాటికి బాగానే కట్నకానుకలు అందజేశారు రంజిత తల్లిదండ్రులు. ఇటీవల మధు తనకు కట్నం సరిపోలేదని.. అదనపు కట్నం కావాలని రంజితను పదే పదే అడగడం, కొన్నిసార్లు చేయి చేసుకోవడం లాంటివి చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని రంజిత తన తల్లికి వీడియో కాల్ చేసి మరీ చెప్పి బాధపడింది. అత్తమామలు, భర్త పెట్టే బాధలు భరించలేక పోయింది.. మానసికంగా క్షోభను అనుభవించిన రంజీత జీవితంపై విరక్తి చెంది.. బలవన్మరణానికి పాల్పపడింది. విషయం తెలిసిన రంజిత కుటుంబ సభ్యులు ఆమె మరణానికి అదనపు కట్నం వేధింపులు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు మరణానికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show comments