P Krishna
Karimnagar Crime News: ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అందుకోవాల్సిన కొంతమంది చిన్న చిన్న కారణాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. బంగారం లాంటి భవిష్యత్ ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
Karimnagar Crime News: ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అందుకోవాల్సిన కొంతమంది చిన్న చిన్న కారణాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. బంగారం లాంటి భవిష్యత్ ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
P Krishna
నేటి సమాజంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం.. ఎదుటి వారిపై చికాకు పడటం లాంటివి చేస్తున్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రేమ వ్యవహారాల వల్ల మనస్థాపానికి గురై ఇలాంటి పనులు చేస్తుంటారు. ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదిరించి తమ భవిష్యత్ కి బంగారు బాటలు వేసుకునేవారు.. కానీ నేటి యువత చిన్న విషయాలకే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతమై జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన చింద మాధవి (23) ఆదివారం రాత్రి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. ప్రస్తుతం మాధవి ఎమ్మెస్సీ చదువుతుంది. పోలీసులకు సమాచారం అందడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. గర్శకుర్తి గ్రామానికి చెందిన లచ్చయ ఇటీవల కన్నుమూశారు. దీంతో ఆయన భార్య లక్ష్మి మానసికంగా ఇబ్బంది పడుతుంది. మాధవి కరీంనగర్ లో ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్తూ ఉండేది. అందరితో ఎంతో హ్యాపీగా ఉండేది. 15 రోజుల క్రితం మాధవి తల్లి లక్ష్మి నర్సింగాపూర్ లోని పెద్ద కూతురు ఇంటికి వెళ్లగా.. మాధవి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. రోజూ ఇంటి ముందు తాళం వేసి.. వెనుక తలుపు నుంచి లోపలికి వెళ్లి గడిపెట్టి నిద్రపోయేది.
ఎప్పటిలాగే సోమవారం ఉదయం పాలు అమ్మే వ్యక్తి పిలవడంతో ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచి ఇంటి తలుపులు కొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ తలుపు తాళం వేయకుండా గడియ పెట్టింది ఉంది దాన్ని తీసి లోపలికి వెళ్లి చూడగా మాధవి ఫ్యాన్ కి వెళాడుతూ కనిపించింద. వెంటనే ఈ విషయం తల్లికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లో అంత ఎత్తు ఉన్న ఫ్యాన్ కి మాధవి ఎలా ఉరి వేసుకుంది.. ఆమె మరణించిన విధానంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది ఆస్తి కోసం చేసిన హత్యా? ఏదైనా ప్రేమ వ్యవహారమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించి తర్వాత బంధువులకు అప్పగించారు. మాధవి మేనమామ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.