P Krishna
Karimnagar Crime News: పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి ఇంటికి పంపించేవారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చి భర్త చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు.
Karimnagar Crime News: పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి ఇంటికి పంపించేవారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చి భర్త చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు.
P Krishna
ఇటీవల కొంతమంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేవంలో ఎదుటివారిపై దాడి చేయడం, ఒక్కోసారి హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పని ఒత్తిడి, వివాహేతర సంబంధాల వల్ల తలెత్తే వివాదాలు, గొడవల వల్ల భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ గొడవలు హత్యలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఓ వ్యక్తి డబ్బు సంపాదించానికి దుబాయ్ వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి తన భార్యపై దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన రాయంచు లింగం, జల దంపతులు. వీరికి కూతురు, కొడుకు ఉన్నానరు. ఇటీవల కూతురుకి పెళ్లి చేశారు. కొడుకు ఉపాది కోసం గల్ఫ్ కు వెళ్లాడు. గ్రామంలో ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మూడేళ్ల క్రితం లింగం కూడా ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి జల ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆదివారం గల్ఫ్ నుంచి లింగం వచ్చాడు. ఈ క్రమంలోనే రాత్రి భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. నిద్రిస్తున్న భార్యపై పారతో తలపై బాది హత్య చేశాడు లింగం.
ఆమె చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత సోమవారం తెల్లవారుజామున తాను క్రిమిసంహారక మందు సేవించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. లింగం పరిస్థితి గమనించిన పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం జిగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరి బింగి సారం విజయ ఫిర్యాదు మేరకు లింగంపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. హత్యకు గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉందని అన్నారు.కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వెచ్చిన తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఇది మొదటి హత్య కేసు అని కోరుట్ల ఇన్ చార్జి సీఐ అన్నారు.