P Krishna
ఇటీవల దేశంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఒకరినొకరు చంపుకునే స్థాకియి వెళ్తున్నారు.
ఇటీవల దేశంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఒకరినొకరు చంపుకునే స్థాకియి వెళ్తున్నారు.
P Krishna
ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తిసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవల అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణాలు చూస్తున్నాం. ప్రేమకు అడ్డు వస్తున్నారని సొంత కుటుంబ సభ్యులను చంపిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయిని వెళ్తున్నారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని ఓ యువతి దారుణానికి తెగబడింది. వివరాల్లోకి వెళితే..
కలబురగి జిల్లా కమల్‌పురా తాలూకా లోని ఓకాలి ప్రాంతంలో మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి పంపించారు. మిస్టిరియస్ మర్డర్ గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. మృతుడు అంబరాయ పట్టేదార్ గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంబరాయ పట్టేదార్ ని హత్య చేసింది కట్టుకున్న భార్య సొంత చెల్లెలు అని పోలీసులు నిర్ధారించారు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడన్న కారణంతో భార్య సోదరి తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
జేవర్గీ తాలూకాలోని కుడి గ్రామానికి చెందిన అంబరాయ పట్టేదార్ కొంత కాలంగా కలబురగి నగరంలో సెంట్రింగ్ పని చేస్తూ తన భార్య తో జీవిస్తున్నాడు. 15 రోజుల క్రితం అతని భార్య బేల కోట గ్రామానికి వచ్చింది. ఇదిలా ఉంటే కొంత కాలంగా తన భార్య సోదరి అయిన అంబిక.. రాజు బరుడా అనే యువకుడితో ప్రేమాయణం సాగిస్తుంది. ఈ విషయం తెలిసిన అంబరాయ తన మరదలిని హెచ్చరించాడు. మరోసారి అతనితో తిరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని భయపెట్టాడు. తన అక్క మొగుడు పదే పదే ప్రేమకు అడ్డు వస్తున్న విషయం గురించి అంబిక తన ప్రేమికుడు రాజు బరుడాతో చెప్పింది. ఈ క్రమంలోనే అతని అడ్డు తొలగించుకోవాలని స్కేచ్ వేశారు. ఈ క్రమంలోనే అంబరాయను మాయమాటలు చెప్పి ఓకాలి ప్రాంతానికి తీసుకువెళ్లి హతమార్చారు. ఈ కేసులో అంబిక, రాజుతో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.