iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. కన్నీళ్లు తెప్పిస్తున్న మృతుడి నేపథ్యం

  • Published Jan 24, 2024 | 3:57 PM Updated Updated Jan 24, 2024 | 3:57 PM

ఈ మద్య ఎక్కడ చూసినా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ప్రాణాలు బలి అవుతున్నాయి.

ఈ మద్య ఎక్కడ చూసినా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ప్రాణాలు బలి అవుతున్నాయి.

  • Published Jan 24, 2024 | 3:57 PMUpdated Jan 24, 2024 | 3:57 PM
హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. కన్నీళ్లు తెప్పిస్తున్న మృతుడి నేపథ్యం

తెలుగు రాష్ట్రాలో ఈ మధ్య వరుసగా రోడ్డు ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాహన లేమి, అతి వేగం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువస్తున్నా, భారీ చలానాలు విధిస్తున్నా.. కొంతమంది డ్రైవర్ల తీరు మార్చకోవడం లేదు. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది జీవితాల్లో విషాదాలు నిండుకుంటున్నాయి. హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం నిండుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమ్మ గుడి వద్ద బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టి (హిట్ అండ్ రన్) అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే కన్నుమూశాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు… ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బైక్ దాదాపు 20 అడుగుల దూరంలో ఎగిరి పడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన అక్కడికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు. మృతుడు నగరానికి చెందిన తారక్ (27) గా గుర్తించారు.

తారక్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ లో ఓ పబ్ లో బౌన్సర్ గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన తారక్ నేపథ్యంలో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. తారక్ చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు.. తల్లి ఎంతో కష్టపడి పోషించి పెంచింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో చదువు మద్యలోనే ఆపాడు తారక్. తర్వాత కుటుంబాన్ని పోషించడం కోసం బౌన్సర్ వృత్తిని ఎంచుకున్నాడు. ఏడాదిన్నర క్రితమే తారక్ వివాహం జరిగింది.. ప్రస్తుతం మూడు నెలల బుబు ఉన్నాడు. కుటుంబాన్ని పోషించే తన తమ్ముడు చనిపోవడంతో తారక్ సోదరి, తల్లి, భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş