P Krishna
ఈ మద్య కాలంలో చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఎదుటి వారిని హత్యలు చేసే స్థాకియి వెళ్తున్నారు. ఇటీవల అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు.
ఈ మద్య కాలంలో చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఎదుటి వారిని హత్యలు చేసే స్థాకియి వెళ్తున్నారు. ఇటీవల అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు.
P Krishna
పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఏమైన జంట కొద్ది కాలంలోనే విడిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాలు, పని ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోతున్నారు. ఇటీవల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంటుంది.. పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న కారణంతో భార్యను.. భర్త అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అక్రమ సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూత్పూర్ మండలానికి చెందిన శేఖర్ గౌడ్ అతని భార్య అనూష (22) కొంతకాంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే అనూష టైలరింగ్ చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. శేఖర్ గౌడ్ ఒక మెకానిక్ షెడ్ లో మెకినిక్ గా విధులు నిర్వహిస్తున్నాడు. బట్టుపల్లి గ్రామానికి చెందిన అరవింద్.. శేఖర్ కి బంధువు అవుతాడు. ఒక సందర్భంలో శేఖర్ భార్య అనూషను అరవింద్ గౌడ్ కలవడం… కొంతకాలం ఫోన్ లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్త శేఖర్ గౌడ్ కి తెలియడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో తన భార్య అనూషపై నిఘా పెట్టాడు. బుధవారం అనూష తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లింది. పక్క సమాచారంతో శేఖర్ గౌడ్ అక్కడికి చేరుకొని ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన వెంటనే శేఖర్ ని చూసి షాక్ తిన్నది అనూష. తన భార్య అరవింద్ తో ఉండటం రెడ్ హ్యాండెడ్ గా చూడటంతో కోపం కట్టలు తెంచుకుంది. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. దీంతో భార్య అనూష అక్కడిక్కడే మరణించగా.. ఆమె ప్రియుడు అరవింద్ గౌడ్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.
భార్య అనూష మృతదేహాన్ని శేఖర్ గౌడ్ స్వగ్రామం అయిన బట్టుపల్లికి తీసుకువెళ్లాడు. గాయపడ్డ అరవింద్ ని ఆశ్రయం కల్పించిన మహిళ ఆస్పత్రికి తరలించింది. అయితే తన భార్య అనూష ఆరోగ్య పరిస్థితి బాగాలేక చనిపోయిందని గ్రామస్థులను నమ్మబలికి.. అంత్యక్రియలకు సిద్దమయ్యాడు. కానీ మృతురాలి పై రక్తపు మరకలు చూసిన గ్రామస్థులకు అనుమానం రావడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని అనూష మృతదేహాన్ని పరిశలించగా ఆమె వీపుపై నాలుగు కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించి.. భర్త శేఖర్ గౌడ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు పోలీసులు.