iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం.. హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్..!

  • Published Apr 08, 2024 | 12:05 PM Updated Updated Apr 10, 2024 | 9:43 AM

Hyderabad Crime News: ఈ మద్య కాలంలో దేశంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. పట్టపగలే మారణకాండ సృష్టిస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

Hyderabad Crime News: ఈ మద్య కాలంలో దేశంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. పట్టపగలే మారణకాండ సృష్టిస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

  • Published Apr 08, 2024 | 12:05 PMUpdated Apr 10, 2024 | 9:43 AM
హైదరాబాద్ లో దారుణం.. హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్..!

ఇటీవల దేశ వ్యాప్తంగా నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా వరకు ప్రేమ వ్యవహారాలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ హత్యల పరంపర కొనసాగుతుందని పోలీసులు అంటున్నారు. మరికొన్ని పాతకక్షల నేపథ్యంలో జరుగుతున్నాయి. ఈ మధ్య హత్యలు చేసి కొంతమంది ధైర్యంగా సోషల్ మీడియాలో తాము ఏదో ఉద్దరించినట్లు పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో పాతకక్షల నేపథ్యంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు.అంతటితో ఆగకుండా కత్తి, రక్తంతో ఉన్న చేతితో ఉన్న వీడియో ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ బాచుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతి నగర్ చెరువు కట్ట దగ్గర తేజన్ (26) అనే యువకుడిని నిన్న అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు వెంటాడి దారుణంగా హత్య చేశారు. యువకుడిపై దాదాపు పదకొండు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు బండరాయితో తలపై మోది హత్య చేశారు. అంతటితో ఆగకుండా నిందితులు హత్యానంతరం కత్తి, రక్తంతో ఉన్న చేతిని తూడ్చుకుంటూ నవ్వుతూ.. కేరితలు కొడుతూ ఇన్‌స్టాగ్రామ్‌ లో రీల్ పోస్ట్ చేశారు. పాత కక్షలే ఈ హత్యకు కారణం అని పోలీసులు, స్థానికులు బావిస్తున్నారు. ప్రగతి నగర్ తన తల్లి, మామ తో జీవిస్తున్నాడు తేజస్ అలియాస్ డీల్. గత ఏడాది దసరా పండుగ రోజు బోరబండలో జరిగిన అరుణ్ హత్య కేసులో తేజన్ A3 గా ఉన్నాడు. రెండు నెలల క్రితమే జైలు నుంచి రిలీజ్ అయి బయటకు వచ్చాడు.

ఈ క్రమంలోనే ఏప్రిల్ 7న కొంతమంది యువకుడు  పని ఉందని బయటకు తీసుకు వెళ్లి మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో తేజన్ కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా 11 కత్తిపోట్లతో విచక్షణారహితంగా పొడిచారు. కింద పడిపోయిన తర్వాత బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం మర్డర్ మేమే చేశామని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు నింధితులు. దీంతో తేజన్ హత్య నగరంలో వైరల్ గా మారింది. ఆ రీల్ లో ‘ధగడ్ బోల్ రే.. సిద్దూ బోల్ రే’ అంటూ రాసుకొచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ రీల్ చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని తేజన్ మృతదేహాన్ని ఆధీనంలోకి తీసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobet