iDreamPost
android-app
ios-app

చిన్న వయసులోనే జడ్జీ అయ్యాడు! ఇంత సాధించినా కూడా!

  • Published Mar 25, 2024 | 8:48 AM Updated Updated Mar 25, 2024 | 8:48 AM

Hyderabad Crime News: ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

Hyderabad Crime News: ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

  • Published Mar 25, 2024 | 8:48 AMUpdated Mar 25, 2024 | 8:48 AM
చిన్న వయసులోనే జడ్జీ అయ్యాడు! ఇంత సాధించినా కూడా!

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతున్నారు. మంచి చదువు ఉండి.. సొసైటీలో గౌరవమైన స్థానంలో ఉన్నవాళ్లు సైతం కొన్ని విషయాల్లో మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల గొడవల జరగడం, మనస్థాపానికి గురై బలవ్మరణాలకు పాల్పపటడం జరుగుతుంది. కొన్నిసార్లు ఎదుటివారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం లాంటివి జరుగుతున్నాయి. దీని వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నిండుకుంటున్నాయి. అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి ఎక్సైజ్ ప్రత్యేక జేఎఫ్‌సీఎం జడ్జీ ఎ మనికంఠ (36) ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. బాగ్ అంబర్‌పేటలోని ఓ అపార్ట్ మెంట్ లో ఆయన కుటుంబంతో ఉంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లావణ్యతో ఏడు సంవత్సరాల క్రితం మనికంఠ పెళ్లైంది. వీరికి విశ్వనాథ్ (5) అనే కొడుకు ఉన్నాడు. గత కొంత కాలంగా మణికంఠ తన భార్యతో గొడవలు పడుతున్నట్లు తెలుస్తుంది.  ఇటీవల మనికంఠతో గొడవ పడి తన కొడుకుతో లావణ్య పుట్టింటికి వెళ్లింది. మరోవైపు మనికంఠ తల్లి ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. ఓ వైపు తల్లి ఆరోగ్య పరిస్తితి విషమించడం, ప్రాణంగా చూసుకుంటున్న కొడుకుని భార్య పుట్టింటికి తీసుకుపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం భార్యకు ఫోన్ చేయగా మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నిన్ను, కొడుకును చూడాలని ఉందని.. రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు.

భార్య మాట వినదు.. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగలేదు.. ఇలా అన్ని రకాలుగా మనోవేదనకు గురయ్యాడు మనికంఠ. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది బెడ్ రూమ్ లోకి వెళ్లి భార్య చున్నీతో ఫ్యాన్ కి ఉరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మణికంఠ మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అంబర్ పేట్ ఇన్స్‌పెక్టర్ అశోక్ తెలిపారు.  చిన్న వయసులో జడ్జీ స్థాయికి ఎదిగిన మణికంఠ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేకపోయామని తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మణికంఠ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet