iDreamPost
android-app
ios-app

మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. వృద్ధుడి కామవాంఛకు బాలుడు బలి..

  • Published Feb 19, 2024 | 4:01 PM Updated Updated Feb 19, 2024 | 4:01 PM

Hyderabad Crime News: ఇటీవల దేశంలో ఆడ పిల్లలపైనే కాదు.. మగ పిల్లలపై కూడా కాంతమంది కామాంధులు రెచ్చిపోతున్నారు. జూబ్లీహిల్స్ లో అలాంటి ఘటన సంచలనం రేపింది.

Hyderabad Crime News: ఇటీవల దేశంలో ఆడ పిల్లలపైనే కాదు.. మగ పిల్లలపై కూడా కాంతమంది కామాంధులు రెచ్చిపోతున్నారు. జూబ్లీహిల్స్ లో అలాంటి ఘటన సంచలనం రేపింది.

  • Published Feb 19, 2024 | 4:01 PMUpdated Feb 19, 2024 | 4:01 PM
మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. వృద్ధుడి కామవాంఛకు బాలుడు బలి..

ఇటీవల కొంతమంది చెడు అలవాట్లకు బానిసైన వాళ్లు కామంతో కళ్లుమూసుకుపోయి చిన్న పిల్లలై అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. ఆడ పిల్లలే కాదు.. మగ పిల్లలపై కూడా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఒంటరిగా ఉన్న మగ పిల్లలకు మాయమాటలు చెప్పి వారితో లైంగిక కోరికలు తీర్చుకుంటున్నారు. తమ గుట్టు బయట పడుతుందన్న భయంతో అన్యాయంగా చంపేస్తునున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన పదేళ్ల బాలుడి కేసు విషయంలో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

జూబ్లీహిల్స్ లో హత్యకు గురైన పదేళ్ల బాలుడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఓ వృద్దుడు తన కామవాంఛ తీర్చుకోవడానికి బాలున్ని దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ లో ఓ బాలుడి అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇదే ప్రాంతంలో ఉంటున్న మన్యం నాయక్ అనే వృద్దుడు బాలుడిని హత్య చేసినట్లు నిర్ధారించారు. తన కామవాంఛ తీర్చుకునేందుకు బాలుడిని కిడ్నాప్ చేసి పార్క్ కి తీసుకువెళ్లాడు. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో భయంతో గొంతు నులిమి చంపేసి నాలాలో పడేసి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.

దుర్గా భవానీ నగర్ కి చెందిన ముడావత్ రమేష్, కవిత రెండో కొడుకు కార్తీక్(10) ఈ నెల 13న రాత్రి కిరాణా షాప్ కి వెళ్లాడు. ఎంతసేపటికి కార్తీక్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు. అదే రోజు పోలీసులకు తమ కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరుసటి రోజు ఓ డ్రైనేజ్ నాలాలో పదేళ్ల బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలుడి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే మన్యం నాయక్ అనే వృద్దుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. మద్యం మత్తులో కార్తీక్ ని 13న రాత్రి పార్క్ లోకి తీసుకువెళ్లి కామవాంఛ తీర్చుకునే ప్రయత్నంలో బాలుడు గట్టిగా కేకలు వేయడంతో గొంతునులిమి రాయితో కొట్టి చంపి డ్రైనేజ్ లోకి తోసినట్లు వృద్దుడు ఒప్పకున్నాడని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş