iDreamPost
android-app
ios-app

జూనియర్ ఆర్టిస్ట్ హత్య కేసులో బయటపడ్డ సంచలన నిజాలు!

  • Published Sep 10, 2023 | 6:50 PM Updated Updated Sep 10, 2023 | 6:50 PM
  • Published Sep 10, 2023 | 6:50 PMUpdated Sep 10, 2023 | 6:50 PM
జూనియర్ ఆర్టిస్ట్ హత్య కేసులో బయటపడ్డ సంచలన నిజాలు!

ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికే మనస్థాపానికి గురై క్షణికావేశంలో ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. ఎదుటివారిని తిట్టడం, దాడులు చేయడం లాంటి చేస్తున్నారు. కొంతమంది హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. తాను ప్రేమించిన యువతితో మరో యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడని కక్ష్యతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మృతుడు జూనియర్ ఆర్టిస్టుగా పచిచేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

మహబూబూనగర్ జిల్లా సంకిస గ్రామానికి చెందిన కార్తీక్ (18) హైదరాబాద్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడు. గత నెల 13 నుంచి అతడి ఆచూకీ తెలియకపోవడంతో 16న సోదరుడు శంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవి ఫుటేజ్, సెల్ ఫోన్ ఆధారంగా నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా కార్తీక్ ని తాము చంపినట్లు ఒప్పుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన టి. సాయి (20) అనే యువకుడు కొంతకాలంగా జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. కొన్నాళ్ల తర్వాత ఆ యువతి అతనితో విభేదించి దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కార్తీక్ తో పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉంటుంది.

ఈ విషయం తెలుసుకున్న సాయి తట్టుకోలేకపోయాడు. కార్తీక్ తో గొడవ పెట్టుకున్నాడు.. తాను ప్రేమించిన యువతిని వదిలేయాల్సిందిగా బెదిరించాడు. కానీ కార్తీక్ మాత్రం ఆ యువతితో సన్నిహితంగానే ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే కార్తీక్ అడ్డు తొలగించాలని సాయి తన స్నేహితులు సురేష్, రఘు, జగదీశ్ తో కలిసి కార్తీక్ హత్యకు పథకం వేశాడు. కార్తీక్ తో స్నేహంగా మాట్లాడి యువతి బట్టలు తన రూమ్ లో ఉన్నాయని అవి తీసుకువెళ్లాల్సిందిగా నమ్మించాడు. ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని ఓల్డ్ బోయినపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి చెట్టుకు కట్టేసి దారుణంగా హత్యచేసి చంపారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. నలుగురు నింధితులను అరెస్టు చేశారు పోలీసులు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş