iDreamPost
android-app
ios-app

పెదనాన్న ఇంట్లో 8వ తరగతి అమ్మాయి చోరీ.. బంగారం మొత్తం లవర్ కి పంపి..

  • Published Apr 16, 2024 | 7:54 PM Updated Updated Apr 16, 2024 | 7:54 PM

Hyderabad Crime News: మీరు చాలా రకాల దొంగతనాలు చూసి ఉంటారు. కానీ, ఇది మాత్రం మిమ్మల్ని కాస్త ఆశ్చర్యానికి, ఇంకొంత భయానికి గురి చేస్తుంది. ఎందుకంటే లవర్ కోసం 8వ తరగతి అమ్మాయి సొంత పెదనాన్న ఇంట్లోనే దొంగతనం చేసింది.

Hyderabad Crime News: మీరు చాలా రకాల దొంగతనాలు చూసి ఉంటారు. కానీ, ఇది మాత్రం మిమ్మల్ని కాస్త ఆశ్చర్యానికి, ఇంకొంత భయానికి గురి చేస్తుంది. ఎందుకంటే లవర్ కోసం 8వ తరగతి అమ్మాయి సొంత పెదనాన్న ఇంట్లోనే దొంగతనం చేసింది.

  • Published Apr 16, 2024 | 7:54 PMUpdated Apr 16, 2024 | 7:54 PM
పెదనాన్న ఇంట్లో 8వ తరగతి అమ్మాయి చోరీ.. బంగారం మొత్తం లవర్ కి పంపి..

సాధారణంగా టెక్నాలజీని వాడుకుని ఇప్పటి తరం పిల్లలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అతి చిన్న వయసులోనే అపారమైన జ్ఞానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇందులో టెక్నాలజీకి కూడా కొంత క్రెడిట్ ని ఇవ్వాలి. అయితే మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది. కొందరు పిల్లలు చదువు కోసం, తెలివితేటలు పెంచుకోవడానికి ఈ టెక్నాలజీని వాడుతుంటే.. ఇంకొందరు మాత్రం తమ జీవితాలను పెడదోవ పట్టించుకోవడానికి వాడుతున్నారు. ప్రేమ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియని వయసులో లవ్, లవర్ అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇదుగో ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ మహాతల్లి అయితే ఏకంగా సొంత పెదనాన్న ఇంటికే కన్నం వేసింది.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకపోతే చంటోడు కూడా ముద్ద తినే పరిస్థితి లేదు. ఇంక చదువుల పేరుతో కొంతమంది పిల్లలు ఆ ఫోన్లు పట్టుకుని వేసే పిచ్చి వేషాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ అమ్మాయి కూడా ఆ కోవకు చెందిందే. ప్రేమ, లవర్ అంటూ పెదనాన్న ఇంట్లో చోరీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ చిలకలగూడలో ఓ కుంటుంబ నివాసం ఉంటోంది. ఆ ఇంటి యజమానురాలు ఎంతో మంచి మనసుతో తన చెల్లెలి కుమార్తెను ఊరి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇక్కడే ఉంటూ చక్కగా చదువుకుంటుందని అలా చేసింది. ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. పెద్దమ్మ ఎంతో ప్రేమగా తీసుకొచ్చి చదివిస్తోందని ఆ అమ్మాయి బుద్ధిగా ఉండాలి. కానీ, తిన్నింటి వాసాలు లెక్కపెట్టింది.

ఈ అమ్మాయికి స్నాప్ చాట్ యాప్ ద్వారా అర్జున్ రెడ్డి అనే కుర్రాడు పరిచయం అయ్యాడు. వారి మధ్య పరిచయం ముదరడంతో అర్జున్ రెడ్డి చెప్పిందల్లా ఈ అమ్మాయి చేయడం స్టార్ట్ చేసింది. ఆమెను గ్రిప్ లో పెట్టుకున్న అర్జున్ రెడ్డి తరచూ డబ్బులు కావాలని అడగడం ప్రారంభించాడు. ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తన లవర్ కు సర్దేయడం స్టార్ట్ చేసింది. అయితే ఆ అమ్మాయి పెదనాన్నకు ఒకరోజు అనుమానం వచ్చింది. ఇంట్లో పెట్టి వెళ్లిన రూ.3 వేలు కనిపించలేదు. ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. అనుమానంతో బీరువా తీసి చూడగా.. మొత్తం 16 తులాల బంగారం, కొంత డబ్బు కనిపించకుండా పోయింది.

అనుమానంతో ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేయగా.. ఒక కుర్రాడితో తరచూ మెసేజ్లు చేస్తున్నట్లు, ఎక్కువసేపు మాట్లాడుతున్నట్లు కనుగొన్నారు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మాయిని విచారించిన పోలీసులు అర్జున్ రెడ్డి వివరాలు తీసుకుని అతడిని పట్టుకున్నారు. ఈ అమ్మాయి మైనర్ కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేశారు. అర్జున్ రెడ్డి అనే కుర్రాడిపై మాత్రం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రులను అలర్ట్ చేస్తున్నారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కాస్త గమనించుకుని ఉండాలని హెచ్చరిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థిని చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom