iDreamPost
android-app
ios-app

ఈ నిబ్బా, నిబ్బి లవ్ స్టోరీ.. ఇప్పుడు కర్ణాటకలో పెద్ద సంచలనం!

  • Published May 15, 2024 | 5:22 PM Updated Updated May 15, 2024 | 5:22 PM

Hubballi Crime News: ఇటీవల ప్రేమ పేరుతో ఎంతోమంది యువకులు యువతులను మాయ మాటలు చెప్పి లొంగదీసుకుంటున్నారు. తమ కోరిక తీరిన తర్వాత దూరం పెట్టడమో.. లేదా చంపేయడం లాంటివి చేస్తున్నారు.

Hubballi Crime News: ఇటీవల ప్రేమ పేరుతో ఎంతోమంది యువకులు యువతులను మాయ మాటలు చెప్పి లొంగదీసుకుంటున్నారు. తమ కోరిక తీరిన తర్వాత దూరం పెట్టడమో.. లేదా చంపేయడం లాంటివి చేస్తున్నారు.

  • Published May 15, 2024 | 5:22 PMUpdated May 15, 2024 | 5:22 PM
ఈ నిబ్బా, నిబ్బి లవ్  స్టోరీ.. ఇప్పుడు కర్ణాటకలో పెద్ద సంచలనం!

దేశంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కొంతమంది మగాళ్లు మృగాళ్లుగా మారిపోతున్నారు. చిన్నా పెద్ద అనే వయసు తేడా లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే కామంతో రెచ్చిపోయి అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఇటీవల కొంతమంది యువకులు యువతులను ప్రేమ పేరుతో వంచిస్తున్నారు.. తమ అవసరాలు తీరిన తర్వాత దూరం పెట్టడమో..అడ్డు వస్తుందని హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. మరికొంతమంది తమ ప్రేమను కాదన్న కోపంతో హత్యలకు పాల్పపడుతున్నారు. అలాంటి ఘటనే హుబ్బళ్లి లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక హుబ్బళ్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. బుధవారం (మే 15) తెల్లవారుజామున ఓ యువతి దారుణ హత్యకు గురైంది. బెండిగేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్ ఓని లో నివాసం ఉంటున్న అంజలి అంబిగర్ (20) ఇంట్లోకి చొరబడి విశ్వ అనే నిందితుడు ఆమె అమ్మమ్మ, సోదరి ఎదురుగానే కత్తితో కడుపులో పొడిచి పొడిచి హత్య చేసి పరారయ్యాడు. గత నెల ఏప్రిల్ 18 న నేహా హిరేమత్ హత్య తరహాలోనే అంజలి హత్యకు గురైనట్లు తెలుస్తుంది. ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకం రేపింది. స్థానికులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హుబ్బళ్లిలో వీరాపూర్ ఓని లో అంజలి అంబిగేర తన అమ్మమ్మ, సోదరితో కలిసి ఉంటుంది. నిందితుడు విశ్వ, అంజలి సహ విద్యార్థులు. అంజలి అంబిగేరాలో క్యాటరింగ్ లో పనిచేస్తుంది. విశ్వ అలియాస్ గిరీష్ పై పలు చోరీ కేసులు ఉన్నాయి. ఇటీవల ఓ బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. విశ్వ తన క్లాస్ మెట్ కావడంతో అంజలి అతనితో సన్నిహితంగా ఉండేది.  ఇటీవల అంజలి.. విశ్వను దూరం పెట్టడటం మొదలు పెట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు విశ్వ. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా అంజలి వేరే ఊరికి ఎళ్లింది. ఈ మధ్యనే తిరిగి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అంజలి వచ్చిన విషయం తెలుసుకొని విశ్వ ఆమె ఇంటికి వెల్లాడు. తనతో వెంటనే మైసూర్ కి రావాలని కోరాడు. కానీ అంజలి తాను ఎక్కడికి రాను అని తేల్చి చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన విశ్వ నా మాట వినకుంటే నేహా హిరేమత్ హత్య చేస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ రోజు బుధవారం తెల్లవారుజామున అంజలి ఇంటికి వెళ్లి అమ్మమ్మ, సోదరి ముందే అంజలిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabetganobet