iDreamPost
android-app
ios-app

విద్యార్థి ఆత్మహత్యకేసులో కొత్త ట్విస్ట్.. ఆమె వేధింపులతోనే..

Haveri Crime News: ప్రపంచంలో ఎక్కడైనా సరే గురువులకు గొప్ప స్థానం కల్పించబడింది. విద్యార్థులకు విద్యాబుబ్దులు, క్రమ శిక్షణ నేర్పించి సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేలా చేస్తారు గురువులు.. అందుకే వారిని త్రిమూర్తులతో పోల్చుతారు.

Haveri Crime News: ప్రపంచంలో ఎక్కడైనా సరే గురువులకు గొప్ప స్థానం కల్పించబడింది. విద్యార్థులకు విద్యాబుబ్దులు, క్రమ శిక్షణ నేర్పించి సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేలా చేస్తారు గురువులు.. అందుకే వారిని త్రిమూర్తులతో పోల్చుతారు.

విద్యార్థి ఆత్మహత్యకేసులో కొత్త ట్విస్ట్.. ఆమె వేధింపులతోనే..

తల్లిదండ్రులు విద్యార్థులకు జన్మనిస్తే.. గురువులు ఆ జన్మకు సార్థకత చేకూరుస్తారు. చక్కటి విద్యాబుద్దులు నేర్పించి బంగారు భవిష్యత్ కి బాటలు వేస్తారు. అందుకే గురువులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చుతారు. అంత గొప్ప గురువు స్థానంలో ఉన్న కొంతమంది ఇటీవల ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. గురువు స్థానానికే తీరని మచ్చ తెస్తున్నారు. విద్యార్ధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, నిచమైన సంబంధాలు పెట్టుకోవడం, సహ ఉపాధ్యాయులను దుర్భాషలాడటం చేస్తున్నారు. ఓ స్కూల్ విద్యార్థిని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పపడింది. ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ఘటన హావేరి జిల్లా దూదిహళ్లి లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక హావేరి జిల్లా దూదిహళ్లి లోని మొరార్జీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని అర్చన గౌడన్న ఆత్మహత్య చేసుకున్న కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న అర్చన గౌడన్న మృతికి కారణం ఉపాధ్యాయుడి భార్య వేధింపులు అని చెబుతున్నారు. వరుస ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి రీ పోస్ట్ మార్టం చేశారు. ఈ క్రమంలోనే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అర్చన దూదిహళ్లిలోని మొరార్జీ రెసిడెన్షియల్ స్కూల్ లో తొమ్మిద తరగతి చదువుతుంది. ఆమెతో పాటు ఉపాధ్యాయుడు అరిఫుల్వా కూతురు జోయా.. అర్చన క్లాస్ మెట్. చదువుల్లో జోయా కన్నా అర్చన ముందుంది. తన కూతురు కన్నా ముందంజలో ఉంటున్న అర్చనపై ద్వేషం పెంచుకుంది అరిఫుల్వా భార్య. అర్చనను తన కూతురుకి అడ్డు రాకుండా చేయాలని కోపంతో పగ పెంచుకుంది.

ఈ క్రమంలోనే తరుచూ అర్చనను ఇంటికి పిలిపించి వేధింపులకు గురి చేస్తూ వచ్చిందని.. దీంతో మనస్థాపానికి గురైన అర్చన సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. అర్చన మృతిపై అనుమానాలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా పరిశీలించి దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే హిరేకేరూర్ తాలూకా లోని అలదకట్టి గ్రామంలో పాతిపెట్టిన అర్చన మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించి రిపోర్టు తయారు చేశారు. హావేరి సబ్ డివిజన్ అధికారి చెన్నప్ప ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ అధికారుల, మృతురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు తమకు సరైన న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి