P Krishna
ఇటీవల చాలా మంది చిన్న విషయానికే డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. చదువు విషయంలో రాణించలేకపోతున్నామని విద్యార్థులు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక భారం తట్టుకోలేక మరికొంత ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ప్ర
ఇటీవల చాలా మంది చిన్న విషయానికే డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. చదువు విషయంలో రాణించలేకపోతున్నామని విద్యార్థులు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక భారం తట్టుకోలేక మరికొంత ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ప్ర
P Krishna
ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమలో విఫలం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ లోకి వెళ్లిన వారు బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది విద్యార్థులు చదువు విషయంలో తల్లిదండ్రుల అంచనా అందుకోవడం లేదని మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పపడుతూ.. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతుంది.
బీటెక్ విద్యార్థిని రేణుశ్రీ ఆత్మహత్య ఘటన మరువక ముందే హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అన్నసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకం రేపుతుంది. సంక్రాంతి సెలవులు రావడంతో అందరూ తమ ఊళ్లకు వెళ్లే హడావుడిలో ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన రాథోడ్ దీప్తి క్యాంపస్ హాస్టల్ లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. దీప్తి స్నేహితులు ఇది గమనించి వెంటనే హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అదించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించిన పోలీసులు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి రూమ్ లో దీప్తి ఒంటరిగా ఉన్నట్లు విద్యార్థినులు తెలిపారు. ఈ క్రమంలోనే దీప్తి ఉరి వేసుకొని ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీప్తి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆమె ఎవరితో చాటింగ్ చేసింది.. ఎవరైనా బెదిరంచారా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయం తెలిసి దీప్తి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండేదని.. చదువు లో కూడా మంచి చలాకీగా ఉంటుంది.. పండుగ పూట ఇలాంటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామని కన్నీటిపర్యంతం అవుతున్నారు.