iDreamPost
android-app
ios-app

భర్త తన పుట్టిన రోజు మర్చిపోయాడని.. భార్య దారుణం!

  • Published Jan 03, 2024 | 1:12 PM Updated Updated Jan 03, 2024 | 1:12 PM

ఈ మద్య కొంతమంది క్షణికావేశం తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. పెద్లలు తీసుకుంటున్న నిర్ణయం వల్ల పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.

ఈ మద్య కొంతమంది క్షణికావేశం తమ ప్రాణాలు తీసుకుంటున్నారు.. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. పెద్లలు తీసుకుంటున్న నిర్ణయం వల్ల పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.

భర్త తన పుట్టిన రోజు మర్చిపోయాడని.. భార్య దారుణం!

పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట ఒక్క ఏడాదిలోనే మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నారు. ఆదిపత్య పోరు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల  భార్యాభర్తలు గొడవలు పడటమే కాదు.. ఆ కారణంతో విడిపోతున్నారు. కొంతమంది క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిష్కార మార్గాల గురించి ఆలోచించకుండా చేస్తున్న తప్పిదాల వల్ల వారి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. భర్త చేసిన ఓ చిన్న పొరపాటుకు భార్య తీవ్ర మనస్థాపానికి గురైంది.. అదే సమయంలో దారుణ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏలూరు జిల్లా నూజివీడులో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదని మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల ఉష కిరణ్మయి, వయసు 35 సంవత్సరాలు. నూజివీడు మండలం రామన్న గూడెం కి చెందిన పామర్తి మన్మథరావుకి తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. పది సంవత్సరాల వీరి సంసార జీవితం హ్యాపీగా సాగిపోతూ వస్తుంది. అయితే ఇటీవల ఉష, మన్మథరావు మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మొదలయ్యాయి. ఉష కిరణ్మయి స్థానికంగా ఓ జ్యులరీ షాపులో పనిచేస్తుంది. ఆమె భర్త మన్మథరావు చేపల వ్యాపారం చేస్తున్నారు.

ఈ నెల 2 న ఉష కిరణ్మయి పుట్టిన రోజు కావడంతో జనవరి ఒకటవ తేదీ రాత్రి 12 గంటల దాటిన తర్వాత మన్మథరావు శుభాకాంక్షలు చెప్పలేదు. ప్రతి సంవత్సరం తనకు సరిగ్గా అర్థరాత్రి పన్నెండు గంటలకు విషెష్ చెప్పే తన భర్త ఈసారి మర్చిపోవడం.. దానికి తోడు కొద్ది రోజులుగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఉష తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే క్షణికావేశంలో దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు పెద్దవి కాకుండా తమలతో తాము పరిష్కరించుకోవాలి.. లేదంటే పెద్దల వద్దకు వెళ్లి పరిష్కార మార్గాలు అన్వేశించాలి.. కానీ ఆత్మహత్యలకు పాల్పపడటం వల్ల వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.