Tirupathi Rao
Crime News: ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్రమ సంబంధాల గోల ఎక్కువైపోయింది. కట్టుకున్న వారిని కాదని బయటి సుఖాల కోసం కక్కుర్తి పడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అలాంటి వారి వల్ల అనర్థాలు కూడా బాగానే జరుగుతున్నాయి.
Crime News: ప్రస్తుతం ఎక్కడ చూసినా అక్రమ సంబంధాల గోల ఎక్కువైపోయింది. కట్టుకున్న వారిని కాదని బయటి సుఖాల కోసం కక్కుర్తి పడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అలాంటి వారి వల్ల అనర్థాలు కూడా బాగానే జరుగుతున్నాయి.
Tirupathi Rao
ప్రస్తుతం సమాజంలో సత్సంబంధాల కంటే అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతోంది. కట్టుకున్న తర్వాత కూడా పరాయి వారిపై మోజుతో తప్పుడు దారుల్లో నడుస్తున్నారు. కట్టుకున్న భార్యను కాదని మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం. కట్టుకున్న భర్తను పట్టించుకోకుండో పరాయి మగాడితో గడప దాటడం చేస్తున్న ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు దారుణాలకు తెర లేపుతున్నాయి. 5 నిమిషాల చీకటి సుఖం కోసం కుటుంబాలను రోడ్డు మీద పడేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక అక్రమమైన సంబంధానికి రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఎక్కడ పరువు పోతుందో అని ప్రాణాలు తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన రాజాపేటలో జరిగింది. రాజాపేట జంగాల కాలనీకి చెందిన పులేందర్, జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన మహిళ ఎవరూలేని సమయంలో ఒకే గదిలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన పులేందర్ భార్య ఆ గదికి తాళం వేసింది. వాళ్లు ఇద్దరికీ పోలీసులకు పట్టిచేందుకు పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టింది. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటూ ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే ఈ గ్యాప్ లో ఈ పులేందర్, ఆ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.
పులేందర్, ఆ మహిళ తమ గురించి అందరికీ తెలిసి పోతుంది అనుకున్నారో? ఈ ఘటన వల్ల తమ ఇరు కుటుంబాల పరువు పోతుంది అనుకున్నారో? లేదంటే వాళ్లు చేసిన పనికి తమ భాగస్వాములకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందనుకున్నారో? కారణం ఏదైనా కూడా వాళ్లిద్దరు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. పులేందర్, ఆ మహిళ ఇద్దరు ఆ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, పులేందర్ భార్య వచ్చి చూసే సరికి అక్కడ వాళ్లిద్దరి మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ జటం ఆత్మహత్యలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలు వీరివి ఆత్మహత్యలేనా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా మృతులకు ఉన్న సంబంధం ఏంటి? అసలు వాళ్లిద్దరు ఒకే గదిలో ఎందుకు ఉన్నారు? ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు వంటి ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు దొరికే ఆస్కారం ఉంది. ఎప్పటి నుంచో కౌన్సిలర్స్, మానసిక నిపుణులు సూచనలు చేస్తూనే ఉన్నారు. కట్టుకున్న వారిని మోసం చేస్తే వారి జీవితాల్లో ఆనందం మాయమౌతుంది అంటారు. తాము పెట్టుకున్న ఒక అక్రమ సంబంధాన్ని కవర్ చేసుకుంటే వాళ్లు తమ జీవితాల్లో ఉండే సంతోషాన్ని కోల్పోతారని విరిస్తున్నారు. వారి సూచనలకు ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పచ్చు.