iDreamPost
android-app
ios-app

రీల్స్ మోజులో భార్య.. హత్య చేసిన భర్త!

రీల్స్ మోజులో భార్య.. హత్య చేసిన భర్త!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అందుకే దాదాపు చాలా మంది బయట ప్రపంచంలో కంటే సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువ టైమ్ గడిపేస్తున్నారు. అంతేకాక రీల్స్, వీడియోలు చేసి.. వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫోస్టు చేస్తున్నారు. అలా వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అయితే  రీల్స్, వీడియోల పిచ్చే.. ఓ వివాహిత ప్రాణం బలి తీసుకుంది. రీల్స్ చేస్తుందని కట్టుకున్న భార్యపై కక్షగట్టిన భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటక జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటక రాష్ట్రం, మండ్య జిల్లా  శ్రీరంగ పట్నం తాలుక మండ్యకొప్పు గ్రామానికి చెందిన పూజ, శ్రీకాంత్  దంపతులు. వీరు తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం పాటు వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగింది. పూజకు రిల్స్ , వీడియోలు చేయడం అంటే  పిచ్చి.  వీడియోలు చేసి.. ఫేమస్ కావాలని పూజ కోరుకునేది. అందుకు తగినట్లు తరచూ రీల్స్  చేస్తూ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో పోస్టు చేసేది. అలానే ఆమెకు ఫాలోవర్స్ కూడా బాగా పెరిగారు. దీంతో పూజ మరింత కొత్త వీడియోలు చేసేందుకు ఎక్కువ సమయంలో ఫోన్ లో  గడిపేది.  ఈ క్రమంలో ఫోన్ వినియోగం తగ్గించమని పూజను ఆమె భర్త శ్రీకాంత్ హెచ్చరించాడు. అయినా అతడి మాటలు లెక్కచేయకుండా రీల్స్ చేస్తూ ఎక్కువ సమయంలో ఫోన్ తోనే గడిపేది. ఈ క్రమంలో ఆమెకు ఎవరితోనే అక్రమ సంబంధం ఉందని శ్రీకాంత్ అనుమానించాడు.

ఈ అనుమానమే పెనుభూతంగా మారి.. పూజ హత్యకు దారి తీసింది. రీల్స్ చేస్తుందని, పరాయి వాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కక్ష గట్టిన శ్రీకాంత్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఆ తరువాత ఆ గ్రామం నుంచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తిలోని ప్రతిభను తొక్కేయ్యడానికి మీరేవరూ అంటూ ఫైర్ అవుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ  అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పెళ్లై ఏడాది కూడా కాలేదు.. పాపం, అంతలోనే..!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom