iDreamPost
android-app
ios-app

పెళ్లై ఏడాది కూడా కాలేదు.. పాపం, అంతలోనే..!

  • Published Aug 14, 2023 | 11:37 AM Updated Updated Aug 14, 2023 | 11:37 AM
  • Published Aug 14, 2023 | 11:37 AMUpdated Aug 14, 2023 | 11:37 AM
పెళ్లై ఏడాది కూడా కాలేదు.. పాపం, అంతలోనే..!

ఈ మధ్యకాలంలో చాలా మంది యువతి, యువకులు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్ల కన్న ఎక్కువగా ప్రేమ వివాహాలకే మొగ్గు చూపుతున్నారు. ఇక కుటుంబ సభ్యులు ఒప్పకోకపోతే ఎదురించి మరీ వివాహం చేసుకుంటున్నారు. పెళ్లి చేసకుని సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. వేధింపులు, అనుమానాలతో హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ ఏడాది కిందట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని రోజులు దంపతులు సంతోషంగా గడిపారో లేదో అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా చిలప్ చేడ్ మండలంలోని సీత్యా తండాలో మహేష్-జ్యోతి (20) దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు ఏడాది కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహ అనంతరం ఈ భార్యాభర్తల కాపురం సజావుగానే సాగింది. ఇక కొంత కాలం పాటు ఈ దంపతులు హైదరాబాద్ జీవనం కొనసాగించారు. అయితే గత నెల రోజుల నుంచి వీరి సొంత గ్రామంలోనే ఉంటున్నారు. ఇకపోతే.. ఈ నెల 11న జ్యోతికి కడుపులో నొప్పిగా ఉండడంతో భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కట్ చేస్తే.. శనివారం ఉదయం మహేష్ జ్యోతి తండ్రికి ఫోన్ చేసి.. మీ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా ఆ వివాహిత ఇంట్లో మంచంపై శవమై కనిపించింది. తండ్రి కూతురుని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలే ఏడ్చాడు. అనంతరం మృతురాలి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మా కూతురిది ఆత్మహత్య కాదని, అల్లుడిపై అనుమానం ఉందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: పని మనిషి బిందుశ్రీ ఇలా చేసిందేంటి? రాత్రి పూట మేడపైకి వెళ్లి..!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş