iDreamPost
android-app
ios-app

భర్తను చెంబుతో కొట్టి హత్య చేసిన భార్య!

భర్తను చెంబుతో కొట్టి హత్య చేసిన భార్య!

భార్యాభర్తల బంధంలో గొడవలు అనేది సర్వసాధారణం. ఆ గొడవల  తీవ్ర అనేది ఆయా దంపతుల స్వభావం, సర్ధుకుపోయే గుణంపై ఆధారపడి ఉంటుంది. అయితే చాలా వరకు భర్తలు పెట్టే హింసలను భార్యలను భరిస్తూ వస్తుంటారు. కొందరు మగవాళ్లు తాగొచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేస్తుంటారు. పిల్లల కోసం, కుటుంబ గౌరవం కోసం భర్త పెట్టే బాధలను భార్యలు భరిస్తుంటారు. అయితే సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఒక్కసారి ఆ హద్దు దాటితే ఆడవారు సైతం అపర కాళికా దేవి మారిపోతారు. ఈ క్రమంలో భర్త పెట్టే వేధింపులు భరించలేక వివిధ మార్గాల్లో హత్య చేస్తుంటారు. కానీ ఓ మహిళ ఏకంగా చెంబుతో కొట్టి భర్తను చంపేసింది. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అంబేద్కర్ కోనసీమ  జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంక ప్రాంతానికి చెందిన ఇసుకపట్ల రామకృష్ణ(34), సత్యనారాయణమ్మ భార్యాభర్తలు.  స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలా ఏళ్ల పాటు వీరి సంసారం ఎంతో హాయిగా సాగింది. అయితే రామకృష్ణ మద్యానికి బానిసగా మారి.. నిత్యం తాగేవాడు. అలా రోజు మద్యం సేవించి భార్య నారాయణంతో ఘర్షణ పడుతుండే వాడు. ఇదే విధంగా చాలా రోజుల నుంచి వారి ఇంట్లో జరుగుతుంది. భర్త తాగి.. ఇంటికి రావడం, తనతో గొడవ పెట్టుకోవడం నరకంగా  భావించింది. అయినా చాలా కాలం పాటు భర్త వేధింపులను భరిస్తూ వచ్చింది.

అలా భర్త రోజూ తాగి వచ్చి చిత్ర హింసలు పెడుతుండంతో ఆమె బాగా విసిగి పోయింది. గురువారం రాత్రి కూడా మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో విసిగి పోయిన భార్య సత్య నారాయణమ్మ.. చెంబుతో భర్త తలపై బలంగా కొట్టింది. దీంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఘటన స్థలాని చేరుకున్న పోలీసు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.  మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş