iDreamPost
android-app
ios-app

కట్టుకున్న భర్తను కాదని.. డ్రైవర్ తో కలిసి భార్య..

ఇటీవల కాలంలో వివాహేత సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు, హత్యలు బాగా పెరిగిపోయాయి. పరాయి సుఖం కోసం భాగస్వామిని హత్య చేసే వారి సంఖ్య ఎక్కువైంది. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ దారుణాలకు పాల్పడే వారిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఓ మహిళ కట్టుకున్న భర్తను కాదని డ్రైవర్ తో కలిసి దారుణానికి తెగబడింది.

ఇటీవల కాలంలో వివాహేత సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు, హత్యలు బాగా పెరిగిపోయాయి. పరాయి సుఖం కోసం భాగస్వామిని హత్య చేసే వారి సంఖ్య ఎక్కువైంది. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ దారుణాలకు పాల్పడే వారిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఓ మహిళ కట్టుకున్న భర్తను కాదని డ్రైవర్ తో కలిసి దారుణానికి తెగబడింది.

కట్టుకున్న భర్తను కాదని.. డ్రైవర్ తో కలిసి భార్య..

ఇటీవల కాలంలో నేరాలు ఘోరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, ఆర్థిక వివాదల కారణంగా జరుగుతున్ననేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పరాయి వారితో క్షణిక శారీరక సుఖం కోసం కొందరు భాగస్వామిని మోసం చేస్తున్నారు. అంతేకాక పరాయి వారి మోజులో పడి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. అంతేకాక కొందరు మహిళలు తాళికట్టిన భర్తను హత్య చేసి..పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేందుకు అనే ప్రయత్నాలు చేస్తుంటారు. అలానే ఓ మహిళ..తన భర్తను చంపేసి.. నాలుగేళ్ల పాటు పోలీసులకు చిక్కలేదు. చివరకు ఓ ట్వీస్ట్ లో నాలుగేళ్ల తరువాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడు రాష్ట్రంలోని ఓ  ప్రాంతంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి తన భార్య మేనకతో కలిసి నివాసం ఉండేవాడు. అతడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే 2015 సెంథిల్ తన తమ్ముడి హత్య కేసులో నిందితుడిగా జైలుకి వెళ్లాడు. ఇదే సమయంలో సెంథిల్ కారు డ్రైవర్  రాజేష్ ఖన్నాకు, మేనకు పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక భర్త జైల్లో ఉండటంతో వారి పడక సుఖానికి అడ్డు అదుపులేకుండా పోయింది. అయితే రోజూలు అన్ని ఓకేలా ఉండవు కదా.. అందుకే 2017లో సెంథిల్  కుమార్  విడుదల అయ్యాడు. ఆ సమయంలో తన కారు డ్రైవర్ రాజేష్ ఖన్నా, అతని భార్య మేనకతో వివాహేతర సంబంధం గురించి సెంథిల్ కుమార్ కు తెలిసింది.

After four years, the wife who killed her husband was arrested

దీంతో సెంథిల్ తన భార్య పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించాడు. ఇక డ్రైవర్ తో తాను సాగిస్తున్న వివాహేతర సంబంధం విషయం తన భర్తకు తెలిసిందని మేనక గ్రహించింది. దీంతో ఆమె సెంథిల్ ను హత్య చేసేందుకు రాజేష్ ఖన్నాతో కలిసి పథకం వేసింది. ప్రణాళిక ప్రకారం సెంథిల్ ను దారుణంగా హత్య చేశారు. అనంతరం విల్లుపురం జిల్లాలోని అటవి ప్రాంతంలో పాతిపెట్టారు. ఏమి తెలియనట్టు భార్య మేనక తన భర్త సెంథిల్ కనపించడంలేదని పోలీసులకు ఫిర్యాధు చేసింది. ఇక సెంథిల్ భార్య మేనక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో సెంథిల్ కారు డ్రైవర్ రాజేష్ ఖన్నా ఈ హత్య చేసినట్టు గుర్తించారు. రాజేష్ ఖన్నాను అరెస్టు చేశారు. సెంథిల్ ను పూడ్చిన స్థలంలో ఆయన ఎముకలు బయటపడటంతో పోలీసులు కేసును మరింత ముందుకు జరిపారు. ప్రియుడు దొరకగానే మేనక పరారైంది. మేనక కోసం నాలుగేళ్లుగా వేట సాగించారు.  చివరకు రాజేష్ ఖన్నా ఇంట్లోనే మేనక నివాసం ఉంటున్నట్టు పోలీసులకు గుర్తించారు. వెంటనే పోలీసులు వెళ్లి  మేనకాను అరెస్టు చేశారు. ఇన్ని రోజులు రాజేష్ ఇంట్లో ఉంటే తమకెందుకు సమాచారం ఇవ్వలేదని స్థానికులను పోలీసులు ప్రశ్నించారు. అయితే మేనకను తామంత రాజేష్ బంధువు అనుకున్నామని పోలీసులతో వారు తెలిపారు. మొత్తంగా డ్రైవర్ కోసం భర్తను హత్య చేసిన ఈ రాక్షసి.. చివరకు కటకటాల పాలైంది. క్షణి సుఖం కోసం వెంపర్లాడి.. చివరకు  ఊచలు లేకపెడుతుంది. ఇలాంటి కామా పిశాచాలకు ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.