iDreamPost
android-app
ios-app

అప్పు తీర్చలేదని మహిళపై అత్యాచారం.. ఫోన్ లో చిత్రీకరించి..

అప్పు తీర్చలేదని మహిళపై అత్యాచారం.. ఫోన్ లో చిత్రీకరించి..

నేటి సమాజంలో మానవత్వం అనేది కనుమరుగైపోతుంది. మనిషి ప్రాణ, మానం కంటే డబ్బుకే విలువ ఇస్తున్నారు. ఇంకా దారుణం ఏమింటే కొందరు ధనం కోసం దారుణమైన పనులకు తెగపడుతున్నారు. ముఖ్యంగా అప్పు ఇచ్చే కొందరు..తిరిగి చెల్లించలేక పోయిన వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అప్పు తీర్చలేదని ఓ మహిళను ఆమె భర్త కళ్లెదుటే అత్యాచారం చేశాడు ఓ వడ్డీ వ్యాపారి. అంతటితో ఆగకుండా.. ఆ దారుణాన్ని తన ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ దారుణ ఘటన పూణేలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దారుణం ఫిబ్రవరిలో జరిగిందని హడప్సర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధిత దంపతులిద్దరూ  షేక్ ఇంతియాజ్  అనే వడ్డీ వ్యాపారి నుంచి రూ.40వేలు అప్పుగా తీసుకున్నారు. అయితే వారు సకాలంలో తీసుకున్న డబ్బులను చెల్లించలేక పోయారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో వారి ఇంటికి వెళ్లిన ఇంతియాజ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే తమ వద్ద ఇప్పుడు డబ్బులు లేవని తరువాత ఇస్తామని బాధితులు తెలిపారు.

వారి సమాధానంతో షేక్ ఇంతియాజ్ కోపోద్రిక్తుడయ్యడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో మహిళ భర్తను చంపుతాన్ని బెదిరించాడు. ఈ క్రమంలో భర్తకు  అడ్డుగా భార్య వచ్చింది. దీంతో ఆ వడ్డీ వ్యాపారి అడ్డుగా ఉన్న మహిళపై  అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ భర్త కళ్లేదుటే.. భార్యపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఈ దారుణాన్ని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అంతేకాక తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని, లేకుంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని  బెదిరించాడు. కానీ ఆమె నిరాకరించింది. దీంతో ఆ వడ్డీ వ్యాపారి ఆ అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలా రోజుల పాటు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు బయపడ్డారు.

చివరకు ఆ బాధితురాలు ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించింది. హడప్సర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతేకాక కోర్టులో హాజరుపర్చి.. గురువారం  వరకు రిమాండ్ లో ఉంచారు. నిందితుడు ఇలాగే ఇతర మహిళలను ఎవరినైనా ట్రాప్ చేశారా? అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రేమ పెళ్లి.. భార్య కుటుంబం మొత్తాన్ని చంపేశాడు!

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetMariobetMadridbetbetciomatbet girişjojobetpalazzobetgrandpashabetgrandpashabetJojobet Girişcasibom girişgrandpashabetbetasusJojobetcasibom girişjojobet girişcasibomJojobetGrandpashabetGrandpashabetcasibom