iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. పక్కింటి యువకుడు చేసిన పనికి..

నిత్యం ప్రేమ పేరుతో ఆడపిల్లలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మానవ మృగాల వేధింపులకు తట్టుకోలేక, మానసిక వేధనకు గురై..కొందరు యువతులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

నిత్యం ప్రేమ పేరుతో ఆడపిల్లలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మానవ మృగాల వేధింపులకు తట్టుకోలేక, మానసిక వేధనకు గురై..కొందరు యువతులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. పక్కింటి యువకుడు చేసిన పనికి..

నేటి సమాజంలో ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఆడవారిపై జరిగే దాడులు మాత్రం ఆగడం లేదు.  ఇంకా చెప్పాలంటే.. ప్రేమ పేరుతో యువతలకు  వేధింపులు  ఎదురవుతున్నాయి. కుటుంబ సభ్యులకు చెప్పలేక, వారిలో వారు మానసిక వేధనకు గురై.. దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ నిశ్చితార్ధమైన యువతి కూడ ఓ యువకుడి వేధింపులకు బలైంది. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతి.. వేధింపులు తట్టుకోలేక దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా పిరియా పట్టణం తాలుకా లో నందిపురం గ్రామం ఉంది. ఈ ఊరిలో  హాలయ్య అనే వ్యక్తి ఉంటే వాడు.  ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. వారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుని పెద్ద చేశారు. ఇక హాలయ్య రెండో సంతానంగా రూపా(28) అనే కుమార్తె ఉంది. రూపా  స్థానిక పట్టణంలో ఎంఏ చదివింది.  రూపా రావందూరు  గ్రామంలోని కేపీఎస్ పాఠశాలలో గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తోంది. రోజు కాలేజీకి ఇంటికి వస్తూ, వెళ్తుండేది. ఇక ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే  కొన్ని నెలల క్రితం కోణసూరుకు  చెందిన దిలీప్ అనే యువకుడితో వివాహం నిశ్చయం చేశారు.

young man murder to women

ఈ క్రమంలోనే రూపాకు, దిలీప్ కు నిశ్చితార్థం కూడా జరిగింది. మరికొద్ది రోజుల్లో వీరిద్దరు వివాహ బంధంతో ఒకటి కావాల్సి ఉంది. ఇక తన కొత్త జీవితాన్ని ఊహించుకుని రూపా ఎన్నో ఆశలతో ఉంది.  ఇదే సమయంలో ఓ యువకుడు ఆమె పాలిట యుముడిగా మారాడు. నందిపుర గ్రామంలో రూపా ఇంటి పక్కనే ఉంటున్న కార్తీక్ ఎంకే అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి చేయడమే కాకుండా బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. రూపా తండ్రి కూడా కార్తీక్ ను హెచ్చరించాడు. అయినప్పటికీ కార్తీక్ వేధింపులు ఆగలేదు.

దీంతో మరికొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సిన రూపా దారుణ నిర్ణయం తీసుకుంది.  ఆ యువకుడి వేధింపులను తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రూపా మృతదేహాన్ని పరిశీలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుమార్తె పాడె ఎక్కడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలా ఆడపిల్లను వేధించే మానవ మృగాలకు ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.