iDreamPost
android-app
ios-app

అందమైన జంట..కానీ, ఊహించని ఘటనతో పెను విషాదం!

ఓ దంపత విషయంలో చాలా దారుణం చోటుచేసుకుంది. ఆ జంటకు దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ.. వారి ఏడాదిన్నర పాప అనాథగా మారింది. ఎంతో హాయిగా సాగిపోతుందనుకున్న వారి సంసారం.. ఊహించని మలుపు తిరిగి..చివరకు విషాదం మారింది.

ఓ దంపత విషయంలో చాలా దారుణం చోటుచేసుకుంది. ఆ జంటకు దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ.. వారి ఏడాదిన్నర పాప అనాథగా మారింది. ఎంతో హాయిగా సాగిపోతుందనుకున్న వారి సంసారం.. ఊహించని మలుపు తిరిగి..చివరకు విషాదం మారింది.

అందమైన జంట..కానీ, ఊహించని ఘటనతో పెను విషాదం!

భార్యాభర్తల బంధం అనేది ఎంతో ప్రత్యేకమైనది. అమ్మానాన్న, పిల్లలు కొంతకాలం వరకే మనతో ఉంటారు. కానీ భాగస్వామి మాత్రమే తోడుగా జీవితాంతం ఉంటుంది. అలాంటి దాంపత్య జీవితాన్ని ఎంతో సంతోషంగా సాగించాలి. కానీ నేటికాలంలో ప్రతి చిన్న విషయానికి దంపతులు గొడవ పడుతున్నారు. చివరకు దారుణమైన నిర్ణయాలతో, విచిత్ర ఘటనలో వారి ఇంట్లో విషాదం అలుముకుంటుంది. తాజాగా కర్నాటక జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భార్య ఇంట్లో, భర్త చెరువులో, ఇళ్లు కాలి బూడిదైంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…

కర్నాటక రాష్ట్రం మండ్యం జిల్లా మందగెరే గ్రామానికి చెందిన స్వాతి(21), మోహన్(26) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. పెళ్లైన కొంతకాలం వరకు వారి సంసారం ఎంతో హాయిగా సాగింది. ఆ తరువాత కుటుంబంలో చిన్న చిన్నగొడవలు జరిగేవి. తరచూ వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగేవని సమాచారం. మంగళవారం ఉదయం వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తుంది. గొడవ అనంతరం మోహన్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక సాయంత్రం ఇంటికి వెళ్లి చూడగా స్వాతి అనుమానస్పద స్థితి మరణించి కనిపించింది. వెంటనే మోహన్ చాలా కంగారు పడిపోయి..ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడితో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఇంటి నుంచి పరారయ్యారు.

ఇక స్వాతి మృతి గురించి తెలుసుకున్న ఆమె బంధువులు మందగేరె గ్రామానికి చేరుకున్నారు. అక్కడ విగతజీవిగా పడి ఉన్న వారి కుమార్తెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డను అత్తమామే హత్య చేసి..ఆత్మహత్యగా చిత్రీకరించారని స్వాతి బంధువులు తెలిపారు. అయితే స్వాతిది హత్యా లేకా ఆత్మహత్యా అనేది తెలియాల్సి ఉంది. ఇక స్వాతి మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక అల్లుడి ఇంటిపై దాడి చేసి..ధ్వంసం చేశారు. అంతేకాక ఇంటికి నిప్పటించారు. వారికి ఉన్న కొబ్బరి తోటకు కూడా నిప్పటించారు. మొత్తంగా దాడిలో దాదాపు రూ.10లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే.. బుధవారం ఉదయం మోహన్ చెరువులో శవమై కనిపించాడు. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాకి గురయ్యారు. మొత్తంగా తల్లిదండ్రుల మృతితో వారి బిడ్డ అనాథగా మారింది. మరి.. ఇలాంటి విషాద ఘటనల నివారణకు ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.