Arjun Suravaram
ఇటీవల కాలంలో ప్రేమ కారణంగా జరిగే హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. పెద్ద ఒప్పుకోకపోవడం, ప్రియులు మోసం చేయడం..కారణం ఏదైనా కావచ్చు..కానీ నిండు జీవితాలు బలైవుతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రేమ కారణంగా జరిగే హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. పెద్ద ఒప్పుకోకపోవడం, ప్రియులు మోసం చేయడం..కారణం ఏదైనా కావచ్చు..కానీ నిండు జీవితాలు బలైవుతున్నాయి.
Arjun Suravaram
ప్రేమ అనే పదం ప్రతి ఒక్కరి నోటి నుంచి సింపుల్ గా వస్తుంది. అయితే దానికి ఉన్న పవర్ ఏమిటనేది చాలా మందికి తెలియదు. ఇక ప్రేమ అనేది మనిషికి ఎన్నో విజయాలను అందిస్తుంది. అదే మిస్ ఫైర్ అయితే అపజయాలను మూటగడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రేమ కారణంగా జరిగే హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. పెద్ద ఒప్పుకోకపోవడం, ప్రియులు మోసం చేయడం..కారణం ఏదైనా కావచ్చు..కానీ నిండు జీవితాలు బలైవుతున్నాయి. తాజాగా ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో ప్రియురాలు మృతి చెందగా..ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన ప్రవళిక తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. అలానే అదే గ్రామంలో రవీందర్ అనే యువకుడు కూడా నివాసం ఉంటున్నాడు. ఇది ఇలా ఉంటే.. ఓసారి వారిద్దరికి పరిచయం కాగా.. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈక్రమంలో ప్రవళిక, రవీందర్ గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. చాలా రోజుల పాటు వారిద్దరి ప్రేమ హాయిగా సాగింది. మరి.. ఏమైందో తెలియదు కానీ ప్రవళిక దారుణ నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇక ఆమె మరణ వార్త తెలుసుకున్న రవీందర్ కూడా దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలి మృతి వార్త తెలుసుకుని..మనస్సులో ఏమనుకున్నాడో తెలియదు కానీ.. తాను కూడా కత్తితో గొంతు కొసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రవీందర్ ను చూసిన స్థానికులు వెంటనే హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థిత విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రవళిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రేమ జంటల ఆత్మహత్యయత్న ఘటనలు స్థానికంగా సంచలనంగా మారాయి. ప్రవళిక మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.
తరచూ ఇలాంటి ప్రేమ విషాదా ఘటనలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. గతంలో ఓ ప్రేమ జంట..తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఊరి బయట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరికొన్ని సందర్భాల్లో అనుమానస్పద స్థితిలో కొన్ని ప్రేమ జంటలు మరణించాయి. అలానే కొందరు ప్రేమలో మోసపోయి.. ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొందరు హత్యలకు తెగబడుతున్నారు. కొందరు యువత ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కార మార్గం అన్వేషించే ప్రయత్నం చేయడం లేదు. అందుకే ఇలాంటి దారుణాలు, ఘోరాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.