iDreamPost
android-app
ios-app

చాకు, సుత్తిలతో ముగ్గురు మహిళల హల్ చల్!

ఇటీవల ఆడవారు కూడా మద్యం తాగి రోడ్లపై రచ్చ చేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ ముగ్గురు మహిళలు కూడా మద్యం మత్తులో చాకు, సుత్తిలతో తెగ హల్ చల్ చేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఇటీవల ఆడవారు కూడా మద్యం తాగి రోడ్లపై రచ్చ చేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ ముగ్గురు మహిళలు కూడా మద్యం మత్తులో చాకు, సుత్తిలతో తెగ హల్ చల్ చేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

చాకు, సుత్తిలతో ముగ్గురు మహిళల హల్ చల్!

ఈ మధ్యకాలంలో పలు ప్రాంతాలలో దొంగతనాలకు సంబంధించిన కేసులు ఎక్కువైపోతున్నాయి. మహిళలు సైతం ఎటువంటి బెరుకు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఇటువంటి కేసులను ఎన్నో చూసి ఉంటాము. ఈ క్రమంలో తాజాగా, కామారెడ్డి జిల్లా దోమకొండలో.. బుధవారం రాత్రి ముగ్గురు మహిళలు కలకలం సృష్టించారు.  ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడిన  మహిళలు.. అక్కడి కాలనీ వాసులకు పట్టుబడ్డారు. దీనితో  వారికి  సరైన బుద్ధి చెప్పి.. పోలీసులకు అప్పగించారు. కానీ, విచారణలో ఆ మహిళలు కొత్త కథనాలు చెప్పడం ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దోమకొండ గ్రామానికి చెందిన పందిరి కాశీనాధ్ ఇంట్లోకి బుధవారం రాత్రి ముగ్గురు మహిళలు చొరబడ్డారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు మహిళలు అక్కడి కాలనీ వాసుల చేతికి చిక్కారు. దీనితో,  కాశీనాధ్ ఇంట్లో నుంచి డబ్బు, నగలు దొంగలించారంటూ.. కాలనీ వాసులు ఆ మహిళలను చితకబాదారు. ఆ తర్వాత  పోలిసులకు సమాచారం అందిచారు. వారిని ఆ దగ్గర లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఆ ముగ్గురు మహిళలు మద్యం సేవించి ఉన్నారని.. వారి వద్ద పెప్పర్ స్ప్రే, కట్టర్, సుత్తి, చాకు వంటి వస్తువులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

ఆ మహిళలు చెప్పిన వివరాల ప్రకారం వారిది మాచారెడ్డి మండలం, లచ్చం పేట గ్రామమని, ఆమె పేరు బూసు కవిత అని.. ఓ మహిళ చెప్పింది. వారు చోరీకి ప్రయత్నించడానికి గల కారణం, గతంలో వారికి దోమకొండకు చెందిన కాశీనాథ్ కు గల సంబంధమే అని సదరు మహిళ వ్యక్తపరిచింది. గతంలో కాశీనాథ్ ఆమెకు రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడని, ఆమె భర్త చనిపోగా.. ఇల్లు అమ్మి మరీ అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చేసానని.. ఆ క్రమంలో మొదట ప్రామిసరీ నోట్లు చించివేసి, రెండేళ్ల తర్వాత వారు ఇచ్చిన చెక్స్ పై చెక్ బౌన్స్ కేసు వేశాడని..దీనితో అతడిపై వేధింపుల కేసు పెట్టానని  నిందితురాలు చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత  కాశీనాథ్ రాజీకి వచ్చి కేసులను విరమించుకుందాం అని చెప్పారని, దీనితో మొదట ఆమె తన కేసును విరమించుకునాన్ని, కానీ, అతడు  కేసును విరమించుకోలేదని పేర్కొంది. కాగా, సదరు నిందితురాలు చెప్పేవన్నీ వాస్తవాలు కాదని. అతడిపై దాడి చేసేందుకే తన ఇంట్లోకి చొరబడ్డారని.. ఆ మహిళలలపై కేసు నమోదు చేయాలని కాశీనాథ్ పోలీసులను కోరాడు. వీటిలో ఏది వాస్తవమో ఇంకా తేలాల్సి ఉంది. పై అధికారుల సూచన ప్రకారం ఈ కేసు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని.. ఎస్సై పేర్కొన్నారు. మరి.. అర్ధరాత్రి మద్యం తాగి దోమకొండ గ్రామంలో కలకలం సృష్టించిన మహిళలపై, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.