iDreamPost
android-app
ios-app

భర్త చనిపోవడంతో మరొకరితో వివాహేతర సంబంధం! కానీ, చివరకు

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తమతో క్లోజ్ గా ఉన్న వారు, వేరే వారితో చనువుగా ఉండటాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వారిలోని పశువును నిద్రలేపుతున్నారు.

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తమతో క్లోజ్ గా ఉన్న వారు, వేరే వారితో చనువుగా ఉండటాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వారిలోని పశువును నిద్రలేపుతున్నారు.

భర్త చనిపోవడంతో మరొకరితో వివాహేతర సంబంధం! కానీ, చివరకు

నేటికాలంలో మనిషిలో అసూయ, ద్వేషం అనేవి పెరిగిపోతున్నాయి. ఇది ముఖ్యంగా అక్రమ సంబంధాలు, అమ్మాయిలు, ఆర్థిక విషయంల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయి, మహిళల విషయంలో కొందరు ఘోరాలకు పాల్పడుతున్నారు. తమతో స్నేహంగా ఉన్న మహిళా లేదా యువతి వేరే వాళ్లతో చనువుగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సదరు మహిళపై దాడులకు కూడా పాల్పడుతున్నారు. మరికొందరు అయితే పరాయి వారితో ఉండటం జీర్ణించుకోలేక హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే ఈ తరహా హత్యలు చాలా జరిగాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా అదే తరహా హత్య జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్  లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఓ హత్య జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…రామంతపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి ప్రాంతంలో మంజుల(40) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె భర్త గతంలో చనిపోయాడు. అయితే ఆమె ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తోంది. అక్కడ పని చేస్తోన్న సమయంలో యజమాని పెన్నాం చంద్రమౌలి(47)తో చనువు ఏర్పడింది. అది కాస్తా కొన్నాళ్లకు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి  దారి తీసింది. అలా మంజులకు చంద్రమౌళితో వివాహేత సంబంధం ఏర్పడింది.

ఇలా సాగుతున్న క్రమంలో ఇటీవలే ఆమె మరోకరితో చనువుగా ఉందని చంద్రమౌళి తెలుసుకున్నాడు. అలా మంజుల వేరే వారితో చనువుగా ఉండటం చంద్రమౌళి జీర్ణించుకోలేపోయాడని సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగిందని సమాచారం.  చివరకు ఆమెను హత్య చేయాలని అతడు భావించాడు. ఈక్రమంలో సోమవారం మంజులను కారుతో ఢీకొట్టి  చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ప్రేమ కారణంగా,  వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న మర్డర్లు ఎక్కువగా ఉన్నాయి.  మూడు రోజుల క్రితం విజయవాడలో ఘోరం జరిగిన సంగతి తెలిసింది.

తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోలేదని, ఆమె తండ్రిని అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు.  ఈ ఘటన అందరని భయాందోళనకు గురి చేసింది. అలానే భర్తను కాదని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళల్లో కొందరు..  ఆ వ్యక్తి చేతిలోనే బలవుతున్నారు. ఇలా అమ్మాయిలు, మహిళల విషయంలో కొందరు క్షణికావేశంలో దారుణమైన పనులను చేస్తున్నారు. చివరకు ఎదుటి వారి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా.. వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే తాజాగా జరిగిన హైదరాబాద్ హత్యా ఘటన. మరి.. ఇలాంటి సంఘటనల నివారణకు ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.