Arjun Suravaram
France News: భర్త అంటే.. జీవితాంతం తన భార్యను కాపాడుకునే తోడు. అలాంటి తోడుగా ఉండాల్సిన భర్తే.. ఆమెను తోడేలు లాగా వెంటపడ్డాడు. భర్తలా కాకుండా కనీసం మనిషిలాగా కూడా ఆమె పట్ల ప్రవర్తించలేదు.
France News: భర్త అంటే.. జీవితాంతం తన భార్యను కాపాడుకునే తోడు. అలాంటి తోడుగా ఉండాల్సిన భర్తే.. ఆమెను తోడేలు లాగా వెంటపడ్డాడు. భర్తలా కాకుండా కనీసం మనిషిలాగా కూడా ఆమె పట్ల ప్రవర్తించలేదు.
Arjun Suravaram
సాధారణంగా భర్త అంటే భార్యకు కష్టసుఖాల్లో నేను ఉన్నానంటూ తోడుగా ఉండాలి. అలానే ఎంతో మంది భర్తలు తమ భార్యలపై ప్రేమను చూపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ కొందరిని చూస్తే..అసలు వీడు మనిషేనా అనే భావన కలుగుతుంది. భార్య పట్ల వారు ప్రవర్తించే తీరు చాలా అమానుషంగా ఉంటుంది. తాజాగా ఓ కసాయి భర్త తన భార్యను పరాయి వ్యక్తులతో అత్యాచారం చేయించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 72 మందితో తన భార్యపై అత్యాచారం చేయించాడు. ఈ దారుణమైన ఘటన ఫ్రాన్స్ దేశంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఫ్రాన్స్‌లోని ఏవిగ్నాన్ ప్రావిన్స్‌లోని మాజాన్ గ్రామానికి చెందిన 71 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగి షాపింగ్ మాల్ లో మహిళలను రహస్యంగా వీడియోలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ సారి అతడు మహిళలను సీక్రెట్ గా వీడియోలు తీస్తుండగా స్థానికలు గుర్తించి..పోలీసులకు అప్పగించారు. విచారణలో భాగంగా అతడి ఫోన్ ను తనిఖీ చేసిన అధికారులు షాకయ్యారు. నిందితుడి ఫోన్ లో అతడి భార్యకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. దీంతో పోలీసులు గట్టిగా విచారణ చేయగా నిర్ఘాతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు తన భార్య పై 72 మందితో అత్యాచారం చేయించాడు.
ఈ ఘటనలు 2011 నుంచి 2020 మధ్య జరిగినట్లు ఫ్రాన్స్ పోలీసులు గుర్తించారు. అతని ఇంట్లో తనిఖీలు చేసి కంప్యూటర్‌లో చూడగా వందల కొద్ది ఫోటోలు, వీడియోలు కనిపించాయి. నిందితుడు రోజూ రాత్రి తన భార్య తినే భోజనంలో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పిన తరువాత ఇతరులను తన ఇంటికి పిలిపించి ఆమెపై అత్యాచారం చేయించేవాడు. ఇలా పదేళ్ల కాలంలో మొత్తం 72 మందితో 92 సార్లు అత్యాచారం చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక బాధితురాలిపై అత్యాచారం చేసిన వారి వయసు 24 ఏళ్ల నుంచి 74 ఏళ్ల మధ్య ఉంటుందని తేల్చారు. ఇక వారు తన భార్యపై లైంగిక దాడి చేస్తుంటే.. వాటిని రహస్యంగా వీడియోలు తీసేవాడు. వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే..తనపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు చెప్పే వరకు కూడా ఆ మహిళలకు తెలియదు. అయితే తనకు జరిగిన దారుణంపై కుంగిపోకుండా..ధైర్యంగా బయటకి వచ్చి ఇలాంటి ఘటనపై బహిరంగ విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ చేసింది. భవిష్యత్‌లో మళ్లీ ఏ మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరింది. విచారణ సందర్భంగా ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. మరి..ఇలాంటి మానవ మృగాలకు ఎటువంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.