iDreamPost
android-app
ios-app

దారుణం.. రూ.5 కోసం హత్య.. అసలు ఏం జరిగిదంటే!

ఇటీవల కాలంలో ఎన్నో దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనలు చూసినప్పుడు మనుషుల రూపంలో మృగాలు తిరుగుతున్నాయా అనే సందేహం వస్తుంది. తాజాగా రూ.5 కోసం దారుణం హత్య జరిగింది.

ఇటీవల కాలంలో ఎన్నో దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనలు చూసినప్పుడు మనుషుల రూపంలో మృగాలు తిరుగుతున్నాయా అనే సందేహం వస్తుంది. తాజాగా రూ.5 కోసం దారుణం హత్య జరిగింది.

దారుణం.. రూ.5 కోసం హత్య.. అసలు ఏం జరిగిదంటే!

సమాజంలో అనేక నేరాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని రకాల నేరాలు గురించి విన్నప్పుడు మాత్రం  చాలా ఆశ్చర్యం  కలుగుతుంది. 100, 200, 500 కోసం కూడ మనిషిని ప్రాణాలు తీసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అంతకు మించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.5ల విషయంలో జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో శ్రీనివాస్ రెడ్డి(58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.  ఇటీవలే వ్యక్తిగత పనుల నిమిత్తం మదనపల్లి వెళ్లారు. అలానే మంగళవారం తిరిగు ప్రయాణంలో రైలులో ధర్మవరంకి చేరుకున్నారు. ఇక రైల్వే స్టేషన్ బయట కొత్తపేట ఆటో స్టాండ్ వద్ద నుంచి పట్టణంలోకి వచ్చేందుకు ఆటో డ్రైవర్  లోకేంద్రంతో బేరమాడారు. అయితే పట్టణంలోకి వెళ్లేందుకు రూ.15 ఛార్జీ అవుతుందని ఆటో డ్రైవర్  అన్నాడు. ఇదే సమయంలో తాను రూ.10 ఇస్తానని శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్ తో చెప్పాడు. ఇక ఐదు రూపాయల తేడా విషయంలో ఇద్దరి మధ్య మాటకు మాట పెరిగింది. ఇదే సమయంలో శ్రీనివాస రెడ్డిపై లోకేంద్ర, అతని స్నేహితుడు విష్ణు దాడి చేశారు. కర్ర, రాళ్లతో కొట్టడంతో లోకేంద్ర, విష్ణు..శ్రీనివాస రెడ్డిపై దాడి చేశారు.

దీంతో శ్రీనివాస రెడ్డి  ఘటనా స్థలంలోనే  మృతి చెందారు. దీంతో ఆటో డ్రైవర్, అతడి స్నేహితుడు విష్ణు, శ్రీనివాస రెడ్డి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి ..అక్కడి నుంచి పారిపోయారు.  స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి..విచారణ చేపట్టారు. నిందితులు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఈ హత్య ఘటన జరిగిన గంటల వ్యవధిలో నిందితులను అరెస్టు చేశారు. మొత్తంగా ఐదు రూపాయల విషయంలో  జరిగిన ఈ గొడవ కారణంగా నిండు ప్రాణం పోవడం స్థానికంగా విషాద ఛాయాలు అలుముకున్నాయి. గతంలోనూ రూ.100, విషయంలో కూడా కత్తులతో పొడిచిన ఘటనలు జరిగాయి.  అలానే రూ.500 విషయంలో గొడవ జరిగి చంపేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఏకంగా 5 రూపాయల కోసం ఈ దారుణం చోటుచేసుకుంది. మరి. ఈ ఐదు రూపాయల హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.