iDreamPost
android-app
ios-app

పెళ్లై ఏడాది కాలేదు.. అంతలోనే వివాహిత దారుణం!

ప్రతి అమ్మాయి తన సంసార జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది. తనకు కాబోయే వరుడి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలానే ఎన్నో ఆశలతో ఏడాది క్రితం సంసార జీవితంలోకి వచ్చిన ఓ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది.

ప్రతి అమ్మాయి తన సంసార జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది. తనకు కాబోయే వరుడి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలానే ఎన్నో ఆశలతో ఏడాది క్రితం సంసార జీవితంలోకి వచ్చిన ఓ వివాహిత దారుణ నిర్ణయం తీసుకుంది.

పెళ్లై ఏడాది కాలేదు.. అంతలోనే వివాహిత దారుణం!

ప్రతి ఆడపిల్లల తన సంసార జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది. తనకు కాబోయే వాడి గురించి ఎంతో ఊహించుకుంటుంది. చాలా మంది జీవితాలు ఎంతో సంతోషంగా సాగుతాయి. అయితే కొందరి అమ్మాయిల జీవితాలు మాత్రం తాము ఊహించిన విధంగా ఉండవు. అంతేకాక వివిధ రకాల వేధింపులకు గురవుతూ నిత్యం నరకం అనుభవిస్తుంటారు. ముఖ్యంగా అత్తింటి వారి నుంచి ఎదురయ్యే వరకట్న వేధింపులకు ఎందరో యువతులు కాళ్లపారాణి ఆరక ముందే కాడికి వెళ్తున్నారు. పెళ్లై ఏడాది కాకుండానే ఓ వివాహిత తీసుకున్న నిర్ణయం అందరిని దుఃఖ సాగరంలో పడేసింది. మరి.. ఆ వివాహిత తీసుకున్ననిర్ణయం ఏమిటి? ఆవిషాదం ఏమిటో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం.

నల్గొండ జిల్లా చందంపేట మండంలం పోలేపల్లి గ్రామ ఆవాస ప్రాంత న బండమీది తండాకు చెందిన సపావట్‌ తిరుపతి, దస్లి దంపతుల ప్రమీల(23) అనే కుమార్తె ఉంది. తిరుపతి సంతానంలో ప్రమీల రెండో సంతానం. ఈమెను అచ్చంపేట మండలం బోల్‌గేట్‌ తండాకు చెందిన బీమ్‌లాల్‌, సక్కి దంపతుల కుమారుడు రామ్‌లాల్‌కి ఇచ్చి గతేడాది వివాహం జరిపించారు. వివాహం జరిగిన కొన్నాళ్ల వరకు ఈ దంపతులు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారి నుంచి ప్రమీలకు వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈక్రమంలోనే ప్రమీల దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. ఈక్రమంలోనే గతంలో ఇరు కుటుంబాల మధ్య పెద్ద మనుషులు పంచాయితీలు నిర్వహించారు. ఆ పంచాయితీ తరువాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తిరిగి అత్తింటి వారు వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు.

విసుగు చెందిన ప్రమీల ఈనెల 5న తన పుట్టింటింకి వెళ్లింది. మరుసటి రోజు తల్లిదండ్రులు కూలీ పనుల కోసం బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ప్రమీల దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగువారు ప్రమీలను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా వరకట్నం వేధింపుల కారణంగా ఎందరో అమ్మాయిలు బలవుతున్నారు. మరి.. ఈవిషాద ఘటన విషయంలో తప్పు ఎవరిది?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.