iDreamPost
android-app
ios-app

చెల్లిపై కోపంతో సొంత ఇంట్లోనే అక్క దారుణం!

  • Published Feb 05, 2024 | 5:14 PM Updated Updated Feb 05, 2024 | 5:14 PM

నేటికాలంలో ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు ఇలాంటి పగలు కూడా ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా సొంత చెల్లిపై కోపంతో అక్క ఓ దారుణానికి ఒడిగట్టింది.

నేటికాలంలో ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు ఇలాంటి పగలు కూడా ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా సొంత చెల్లిపై కోపంతో అక్క ఓ దారుణానికి ఒడిగట్టింది.

  • Published Feb 05, 2024 | 5:14 PMUpdated Feb 05, 2024 | 5:14 PM
చెల్లిపై కోపంతో సొంత ఇంట్లోనే అక్క దారుణం!

కుటుంబాల్లో ఉండే బంధాలు, అనుబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరికి చిన్న కష్టం వచ్చిన ఇంట్లోని కుటుంబ సభ్యులు అల్లాడిపోతుంటారు. ఇక అక్కాచెల్లెల్ల మధ్య ఉండే ప్రేమానురాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకుంటూ.. సాయం కూడా చేసుకుంటారు. అప్పుడప్పుడు ఒకరిపై మరొకరు అలిగిన కాసేపు తరువాత కలిసి పోతుంటారు. కానీ ఓ అక్క మాత్రం చెల్లిపై కోపంతో దారుణం చేసింది. పోలీసులు విచారించగా ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌కు చెందిన కమలేశ్‌ అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని జనవరి 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రూ.25 వేల నగదును దొంగలు చోరీ చేసినట్లు సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఆమె నుంచి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించగా ఒక మహిళ బురఖా వేసుకుని అనుమానస్పందంగా తిరగడం కనిపించింది.

ఆ బురఖా వేసుకున్న మహిళ ఎవరు అని తెలుసుకునేందుకు పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేశారు. చివరకు బురఖా వేసుకున్న మహిళను శ్వేత(31)గా పోలీసులు తేల్చారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శ్వేత స్వయానా కమలేశ్ కూతురు. జనవరి మొదటి వారంలోనే ఇంటి నుంచి  శ్వేత బయటికి వెళ్లి..వేరుగా ఉంటుంది. ఒక సారి తల్లిని చూడటానికి శ్వేత కమలేశ్ ఇంటికి వెళ్లింది. ఆసమయంలో తొలుత బీరువా తాళం చెవులను కొట్టేసింది. మరోసారి తల్లి లేనప్పుడు వచ్చిన బీరువాలోని నగలు, డబ్బులను ఎత్తుకెళ్లింది.  ఆ తరువాత తనకు ఏమి తెలియనట్లు ఉంది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక నిందితురాలు శ్వేతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక పోలీసుల విచారణలో శ్వేత..విస్తుపోయే నిజాలు చెప్పింది. తన కంటే చెల్లినే బాగా చూసుకుంటున్నారన్న కోపంతోనే ఈ దోపిడీకి పాల్పడినట్లు శ్వేత పోలీసుల విచారణలో ఒప్పుకుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ వింత నేరం జరిగింది. ఇక ఈ వింత పగపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి..చెల్లిపై ఇలా కూడ పగ పెంచుకుంటారా? అని స్థానికులు సందేహం వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio