iDreamPost
android-app
ios-app

ప్రియుడిపై కోపంతో యువతి కిరాతకం! అతడి బిడ్డను..

ప్రియుడిపై కోపంతో యువతి కిరాతకం! అతడి బిడ్డను..

ఈ మధ్యకాలంలో ప్రేమ, వివాహేతర సంబంధాలు, సహజీవన బంధాల కారణంగా జరుగుతున్న నేరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రియుడిపై మోజులో సొంత బిడ్డలను చంపుకునే రాక్షస తల్లులు ఉన్నారు. అలానే ప్రియుడిపై కోపంతో అతడి బిడ్డను హతమార్చింది ఓ వివాహిత. ప్రియుడు తనను వదిలేశాడనే కోపంతో అతడి 11 ఏళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.  స్థానికంగా 300 సీసీటీవీ పుటేజీలను పరిశీలించి చివరకు నిందితురాలిని పట్టుకున్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఢిల్లీలో పూజ కుమారి అనే 24 ఏళ్ల యువతి నివాసం ఉంటుంది. ఆమెకు 2019లో  జితేంద్ర అనే వ్యక్తితో పరిచయమై సహజీవనం చేస్తోంది. అయితే జితేంద్రకి అప్పటికే  రిత్యా అనే యువతి పెళ్లైంది. వారికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో జితేంద్ర..తన భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు. అలా భార్య నుంచి విడిపోయి.. పూజ కుమారితో కలిసి ఉండేవాడు. మూడేళ్ల పాటు వీరిద్దరు కలిసే జీవించారు. కానీ ఇటీవల జితేంద్ర తిరిగి..తన భార్య కుమారుడి వద్దకు వెళ్లిపోయాడు. దీంతో తనను నమ్మించి మోసం చేశాడని పూజ..జితేంద్రపై కోపం పెంచుకుంది.

అతడి స్నేహితుల్లో ఒకరి ద్వారా  ఇంటి అడ్రెస్ తీసుకుంది. ఆగష్టు 10న ఇందర్ పూరిలోని జితేంద్ర నివాసానికి  పూజ వెళ్లింది. అక్కడ ఇంటి తలుపు తెరిచి ఉండటం గమనించి లోపలికి వెళ్లగా.. జితేంద్ర లేడు. అతడి కుమారుడు దివ్యాంష్ ఒక్కడే ఒంటరిగా నిద్రిస్తున్నాడు.  ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించి.. ఆ బాలుడిని చంపేసింది. ఆ తరువాత అక్కడి నుంచి పరారైంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు పూజనే ఈ హత్య చేసి ఉంటుందని పోలీసులు భావించారు.

ఈ క్రమంలో తొలుత పూజ.. తల్లిదండ్రులను పోలీసులు కలిశారు. అక్కడ ఆమె ఉండటం లేదని తెలుసుకున్న  హత్య జరిగిన ఇందర్ పూరి పరిసర ప్రాంతాల్లో సుమారు 300 సీసీ పుటేజిలను పరిశీలించారు. ఈక్రమంలో నిందితురాలి కోసం పోలీసులు జల్లెడ పట్టారు. చివరకు హత్య జరిగిన మూడు రోజులకు పూజ కుమారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి.. ప్రియుడిపై కోపంతో బాలుడిని హత్య చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మగాళ్లే ఆమె టార్గెట్‌.. అందంతో ఎరవేసి.. ఇంటికి ఆహ్వానించి..

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş