క్షేమంగా వస్తానని.. విగతజీవిగా ఇంటికి తిరిగొచ్చిన యువతి!

Bhadradri Kothagudem News: తమ బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తాదని ఆ తల్లిదండ్రులు భావించారు. ఆమె కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. బిడ్డ ఇంటికి వచ్చింది..కానీ వారు అనుకున్నట్లు కాదు..శవమై వచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు.

Bhadradri Kothagudem News: తమ బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తాదని ఆ తల్లిదండ్రులు భావించారు. ఆమె కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. బిడ్డ ఇంటికి వచ్చింది..కానీ వారు అనుకున్నట్లు కాదు..శవమై వచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు.

ప్రతి ఒక్కరు తమ బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారు ఉన్నత స్థాయికి వెళ్లి తమకు పేరు ప్రఖ్యాతలు తెస్తారని అనుకుంటారు. అలానే పిల్లలు కూడా వివిధ రంగాల్లో చేరి..తమ లక్ష్యాలను సాధిస్తుంటారు. కొందరి జీవితాలు మాత్రం ఊహించని మలుపు తిరిగి..మృత్యువు ఒడిలోకి చేరుతుంటారు. ఏడేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరి సెంట్రల్‌ కమిటీ ప్రొటెక్షన్‌ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన బంటి రాధ అలియాస్‌ నీల్సో (25)ను మావోయిస్టులు ఇన్ఫార్మర్‌ నెపంతో హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిడ్డ మరణ వార్త తెలిసి.. మృతురాలి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్రూవర్‌గా మారి క్షేమంగా ఇంటికి వస్తానన్న నా బిడ్డ శవంగా తిరిగొచ్చిందని మృతురాలి తల్లి పల్లెపాటి పోచమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

బుధవారం రాధ మరణవార్త గురించి సమాచారం అందుకున్న రాధ కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం రాధ మృతదేహాన్ని వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నగంరోలని కాప్రా పరిధిలోని న్యూ ఇందిరానగర్‌లోని తమ నివాసానికి రాధ మృతదేహాన్ని తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య రాధ అంత్యక్రియలు నిర్వహించారు.

బుధవారం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపురం ఫారెస్ట్ ఏరియాలో ఇన్ ఫార్మర్ నెపంతో పల్లెపాటి రాధ యువతి హత్య చేశారు.  పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరించనందుకు ఆమెను హతమార్చినట్లు ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలివెళ్లారు.  మేడ్చల్ జిల్లా కాప్రాకు చెందిన పల్లెపాటి రాధ నర్సింగ్ విద్యను పూర్త  చేసింది. అనంతరం  2018లో విప్లవోద్యమంలో చేరింది. అనారోగ్యంతో ఉన్న దళ సభ్యులకు రాధ అలియాస్ నీల్సో అందిస్తోంది. ఇటీవలే అఫ్రూవర్ గా మారిన నేపథ్యంలోనే తాజాగా రాధను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేసింది పోలీస్ శాఖ. రాధ మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Show comments