Arjun Suravaram
ఆస్తుల, డబ్బులు మనుషుల మధ్య బంధాలనే కాదు.. ఏకంగా ప్రాణాలనే బలి తీసుకుంటున్నాయి. తాజాగా సొంత తమ్ముడిని, వేరే కుటుంబాన్ని అత్యంత దారుణంగా నరికి చంపిచేశాడు ఓ అన్న. తల్లిదండ్రులను చంపాలని వేసిన స్కెచ్ కి ..వేరే కుటుంబం బలైంది.
ఆస్తుల, డబ్బులు మనుషుల మధ్య బంధాలనే కాదు.. ఏకంగా ప్రాణాలనే బలి తీసుకుంటున్నాయి. తాజాగా సొంత తమ్ముడిని, వేరే కుటుంబాన్ని అత్యంత దారుణంగా నరికి చంపిచేశాడు ఓ అన్న. తల్లిదండ్రులను చంపాలని వేసిన స్కెచ్ కి ..వేరే కుటుంబం బలైంది.
Arjun Suravaram
నేటికాలంలో మానవ సంబంధాల కంటే.. ఆర్థిక సంబంధాలే ఎక్కవయ్యాయి. అంతేకాక రక్తసంబంధాల కంటే డబ్బులకే ఎక్కువ విలువ ఇచ్చే మనుషుల సంఖ్య పెరిగిపోయింది. ఇంకా దారుణం ఏమిటంటే..డబ్బులు, స్థలం వంటి ఆస్తుల విషయంలో సొంత వారిని హతమార్చే కసాయి వాళ్లు ఎక్కువయ్యారు. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిని దారుణంగా హత్య చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి.. తల్లిదండ్రులను, సోదరిని దారుణంగా నరికి చంపేయించాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లా గదగ్ పట్టణంలో నివాసం ఉండే ప్రకాశ్ బాకలే, సునంద దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ బాకలే (27)తో పాటు వారి బంధువులు పరుశురాం (58), ఆయన భార్య లక్ష్మీ (50), కూతురు ఆకాంక్ష (17)లను దారుణంగా హత్య గావింపబడ్డారు. ఈ నెల 19న జరిగిన ఈ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఆ రోజు ఆ ఇంట్లో శుభకార్యం ఉండడంతో పరశురాం, భార్యా పిల్లలతో అక్కడకు వచ్చి బస చేశాడు. అదే సమయంలో దుండగుల కత్తుల నరికి చంపేశారు. ఈ హత్యలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయ్యగా నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేయగా నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. ప్రకాష్, సునంద దంపతుల పెద్ద కొడుకు వినాయక్ బాకలే (35) హత్యలకు సూత్రధారి అని తెలింది. సోమవారం ఐజీపీ వికాస్ కుమార్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులతో వినాయక్‌కు గొడవలు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. తమకు తెలియకుండా ఆస్తులను అమ్మవద్దని ప్రకాశ్ దంపతులు వినాయక్‌ను గతంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే వినాయక్ బాకలే ఈ హత్యలు చేయించాడని పోలీసులు ప్రకటించారు.
ఆస్తి గొడవల కారణంగా పెద్ద కుమారుడే తన కుటుంబాన్ని అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఈ హత్యలకు రూ.65 లక్షలకు సుపారీ మాట్లాడాడు. పోలీసులు ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల ఫోటోలు, వీడియోలు వంటి తదితరాలను ఆధారంగా చేసుకుని నిందితులను గుర్తించారు. అయితే ఆ రోజు ఇంట్లో ఉన్నది వినాయక్ తల్లిదండ్రులేనని పొరబడి హంతకులు కార్తీక్‌తో పాటు అక్కడి వచ్చిన అతిథులను చంపేశారు. సొంత కొడుకే ఇంతటి దారుణానికి పాల్పడతాడనుకోలేదని ఆ తల్లిదండ్రులు వాపోయారు. గతంలోనూ ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను చంపిన పుత్రరత్నాలు ఉన్నాయి. అలానే పొలం గట్ల విషయంలో తోడబుట్టిన వారిని అతికిరాతకంగా నరికి చంపిన ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు చూస్తే సమాజం ఎటువెళ్తుందో అనే భావన కలుగుతుంది.