iDreamPost
android-app
ios-app

దారుణ ఘటన.. YCPకి ఓటేసిందని తల్లిని చంపిన కసాయి కొడుకు!

  • Published May 15, 2024 | 12:18 PM Updated Updated May 15, 2024 | 12:18 PM

తనకు జీవితం ప్రసాధించిన తల్లిపై కొందరు పుత్రులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. వివిధ విషయాల్లో వారిని తీవ్రంగా కొట్టడం చేస్తుంటారు. అలానే మరికొందరు కొడుకులు ఏకంగా హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.

తనకు జీవితం ప్రసాధించిన తల్లిపై కొందరు పుత్రులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. వివిధ విషయాల్లో వారిని తీవ్రంగా కొట్టడం చేస్తుంటారు. అలానే మరికొందరు కొడుకులు ఏకంగా హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.

  • Published May 15, 2024 | 12:18 PMUpdated May 15, 2024 | 12:18 PM
దారుణ ఘటన.. YCPకి ఓటేసిందని తల్లిని చంపిన కసాయి కొడుకు!

అమ్మ.. అనే పదం చూడటానికి రెండు అక్షరాలే అయినా..త్యాగానికి ప్రతిరూపం. బిడ్డల కోసం తల్లి చేసే త్యాగాల ముందు ఏవి సరిపోవు. అలానే స్వార్థం లేకుండా ప్రేమను చూపించేదే కేవలం  అమ్మ మాత్రమే. తన బిడ్డకు ఏమైన జరిగితే తల్లి అల్లాడి పోతుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ బిడ్డను పెంచి పెద్ద చేస్తోంది. అలా తనకు జీవితం ప్రసాధించిన తల్లిపై కొందరు పుత్రులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. వివిధ విషయాల్లో వారిని తీవ్రంగా కొట్టడం చేస్తుంటారు. అలానే మరికొందరు కొడుకులు ఏకంగా హత్యలు కూడా చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ కి ఓటేసిందని తల్లిని ఓ కుమారుడు చంపాడు. స్థానికుల కథనం మేరకు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. వైసీపల్లికి చెందిన సుంకమ్మ(52) తన కుటుంబతో కలిసి నివాసం ఉంటుంది. స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమె దారుణ హత్యకు గురైంది.  సోమవారం జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ కు సంబంధించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగిన సంగతి  తెలిసిందే. అలానే అనంతపురం జిల్లాలో కూడా పోలింగ్ బాగా జరిగింది. ఓటర్లు ఓటేసందుకు పోలింగ్ కేంద్రం వైపు క్యూ కట్టారు.

ఈ సందర్భంగా సుంకమ్మ కూడా తన ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి.. సుంకమ్మ ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘వైసీపీ’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు అనుమానించాడని సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి తల్లితో వెంకటేశ్వర్లు వాగ్వాదం పెట్టుకున్నాడు. తనకు తెలియకుండా ఫ్యాన్ కి ఓటు ఎందుకు వేశావని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తల్లిపై సుత్తితో దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటిక వరకు తల్లిదండ్రులపై దాడులు చేసిన కొడుకులకు సంబంధించిన ఘటనలు అనేకం చూశాం. తాగిన మైకంలో తల్లిని రాడ్డుతో కొట్టిన కసాయి కొడుకు. అలానే  వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కాలితో తన్ని పుత్రులు ఘటనలు అనేకం జరిగాయి. తన ప్రాణాలను ఫణంగా పెట్టి పెంచిన తల్లి ప్రాణాలనే ఇలాంటి కొందరు కసాయి కొడుకులు బలి తీసుకుంటున్నారు. ఈ ఘటనలు చూస్తుంటే.. అసలు సమాజం ఎటువైపు వెళ్తోంది.. రక్త బంధాలకు విలువ లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş